స్టేడియంలో 'జై శ్రీరాం' మోత మామూలుగా లేదుగా?

క్రికెట్ జట్లు ఎన్ని ఉన్నా.. భారత్ -పాక్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

Update: 2023-10-15 04:12 GMT

క్రికెట్ జట్లు ఎన్ని ఉన్నా.. భారత్ -పాక్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ లో నిర్వహించిన వన్డేలో భారత్ అదరగొట్టే విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. మ్యాచ్ లో గెలుపు ఆనందం ఒక ఎత్తు అయితే.. స్టేడియంలో విరగబడ్డ ప్రేక్షుల ఉత్సాహం.. వారి హుషారు సరికొద్ద సందడిని కారణమైంది. మామూలుగానే జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే తీవ్రమైన భావోద్వేగానికి గురి అవుతాం. అలాంటిది లక్ష మందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపిస్తే ఆ శబ్దం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి అనుభూతిని స్టేడియంలోని ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది అలాంటి ఫీల్ ను అనుభవించారు. సుమారు లక్ష మంది ఒక్కసారిగా జనగణమణ అంటూ గొంతు కలిపినప్పుడు.. వచ్చే వైబ్రేషన్ చాలామందిని తీవ్రమైన ఎమోషన్ కు గురి చేసింది. అంతేకాదు.. మ్యాచ్ సందర్భంగా జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ నినాదాలు మిన్నంటాయి.

పాకిస్తాన్ తో మ్యాచ్ కావటంతో స్టేడియంలోని వారు.. ఒక్కసారిగా జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ చేసిన నినాదాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో.. ‘జై శ్రీరాం.. జై శ్రీరాం.. రాజారాం’ పాటను ప్లే చేసిన వేళ.. యావత్ స్టేడియం ఊగిపోయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా పాక్ తో జరిగిన మ్యాచ్ హైఓల్టేజ్ మ్యాచ్ అన్నది తెలిసిందే. ఇది సరిపోదున్నట్లుగా ఎమోషనల్ అంశాలు కలగలవటంతో మ్యాచ్ సందర్భంగా స్పెషల్ సీన్లు పలు చోటు చేసుకున్నాయని చెప్పాలి.

ఈ మ్యాచ్ ను కళ్లారా చూసేందుకు.. దేశం అన్ని వైపుల నుంచే కాదు విదేశాల నుంచి పలువురు క్రీడాభిమానులు మ్యాచ్ కు హాజరు కావటం గమనార్హం. ఈ మ్యాచ్ గెలిస్తే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడినా పట్టించుకోమని పలువురు క్రీడాభిమానులు పేర్కొనటం గమనార్హం. ఈ మ్యాచ్ గెలుపుతో తాము ఇప్పుడే దీపావళిని చేసుకుంటున్నట్లుగా చెప్పిన వైనం చూస్తే.. దాయాదితో జరిగిన మ్యాచ్ భావోద్వేగంతో నిండిందో అర్థమవుతుంది.

Tags:    

Similar News