మహాభారత కాలంటే... అందుకే ఆస్ట్రేలియా గెలిచింది.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి వింత వాదన
ఇదిలావుంటే.. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన పోరును ఉటంకిస్తూ.. సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ..వింత వాదన తెరమీదికి తెచ్చారు.
వన్డే ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు ఒకింత ఆవేదనతో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతో దూకుడు ప్రదర్శించిన టీం ఇండియా ఇలా కుప్పకూలి పోవడం ఏంటి? అని ఇంకా ఆ బాధ నుంచి తేరుకోలేక పోతున్నారు. దీంతో ఈ ఆవేదనను దూరం చేసేందుకు అనేక మంది అనేక రూపాల్లో క్రికెట్ అభిమానులకు సర్ది చెబుతున్నారు.
ఇదిలావుంటే.. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన పోరును ఉటంకిస్తూ.. సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ..వింత వాదన తెరమీదికి తెచ్చారు. "ఆస్ట్రేలియాను ఆయన అమ్ముల పొది"గా పేర్కొన్నారు. అంతేకాదు.. మహాభారత కాలంలో ఆస్ట్రేలియా మనకు అస్త్రాలను దాచుకునే అమ్ముల పొదిగా ఉండేదని.. అందుకే అక్కడ శక్తి ఎక్కువగా ప్రసరిస్తుందనే భావనలో ఆయన ట్వీట్ చేశారు.
పాండవుల కాలంలో ఆస్ట్రేలియా మన భారతదేశానికి ఆయుధశాలగా ఉండేదని.. అందుకే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు భారత్‌పై విజయం సాధించిందని జస్టిస్ కట్జూ పేర్కొన్నారు. "పాండవుల కాలంలో ఆస్ట్రేలియా 'అస్త్రాల' నిల్వ కేంద్రంగా ఉండేది. ఆ రోజుల్లో దానిని 'అస్త్రాలయా' అని పిలిచేవారు. వాళ్లు ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం" అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇక, ఈ వింత వాదనపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. 'ధన్యవాదాలు సార్.. ఇలాంటి హ్యూమర్‌తో మీరు మమ్మల్ని పలకరించి చాలాకాలం అవుతోంది" అని ఒకరు పేర్కొంటే.. "దుబాయ్‌ని మిస్టర్ దూబే, ఈజిప్టుని మిస్టర్ మిశ్రా, ఇజ్రాయెల్‌ని యాదవులు, బహ్రెయిన్‌ని బ్రాహ్మణులు, సౌదీ అరేబియాని సరస్వతీ దేవి రూపొందించారు" అంటూ మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం.