టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. మేటి పేసర్ తిరిగొస్తున్నాడోచ్

వన్డే ప్రపంచ కప్ తర్వాత అక్టోబరు-నవంబరులో భారత్ లో జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో షమీ ఎలాంటి ప్రదర్శన చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది.

Update: 2024-07-18 01:30 GMT

మొన్నటివరకు టి20 ప్రపంచ కప్.. అంతకుముందు ఐపీఎల్.. దానికిముందు ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్.. టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్ ఆడి ఇప్పటికే ఆరు నెలలు అవుతోంది. ఇక మళ్లీ టెస్టు మ్యాచ్ ఎప్పుడంటే..? సెప్టెంబరులోనే. సంప్రదాయ ఫార్మాట్ లో పెద్దగా బలంగా లేని బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే, ఆ తర్వాత అసలు కథ ఉంది. న్యూజిలాండ్ వంటి పటిష్ఠ జట్టుతో మూడు టెస్టులు ఆపై అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్. ఇలాంటి సమయంలో జట్టుకు అత్యవసరం పేస్ విభాగం బలపడడం.

బుమ్రా, సిరాజ్ ఓకే.. మరి అతడు?

టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఎదుర్కొనడం చాలా కష్టం. అందులోనూ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం. గత రెండు సిరీస్ ల నుంచి మన చేతుల్లో వారు పరాభావం ఎదుర్కొన్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంటారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో భారత జట్టుకు బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉండడం అవసరం. అయితే, వీరిద్దరే సరిపోరు. మరో సమర్థుడైన పేసర్ కావాలి. అతడే మొహమ్మద్ షమీ.

వన్డే ప్రపంచ కప్ తర్వాత అక్టోబరు-నవంబరులో భారత్ లో జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో షమీ ఎలాంటి ప్రదర్శన చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. భారత్ ఫైనల్ కు చేరిందంటే అందులో ప్రధాన పాత్ర షమీదే. అయితే ,ప్రపంచ కప్ తర్వాత గాయంతో షమీ జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో అతడు ఇబ్బంది పడ్డాడు. దానికి సర్జరీ చేయించుకున్న షమీ కొన్నాళ్లుగా కోలుకుంటున్నాడు. జట్టులోకి పునరాగమనానికి సిద్ధం అవుతున్నాడు. మొన్నటివరకు ఉత్తరప్రదేశ్ లోని సొంత ఫామ్ హౌస్ లో తేలికపాటి ప్రాక్టీస్ చేసిన షమీ.. ఇప్పుడు నెట్స్‌ లో వచ్చాడు. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ రిథమ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి స్థాయి లయ అందుకోవాలంటే మరికొన్ని రోజులు పట్టే వీలుంది. కాగా, బౌలింగ్ ప్రాక్టీస్ వీడియోను షమీ ఇన్‌స్టాగ్రామ్‌ లో పంచుకున్నాడు.

వచ్చే నెల నుంచి..షమీ ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయగలిగితే.. సెప్టెంబరులో బంగ్లాదేశ్‌ తో సిరీస్ కు ఎంపికవడం గ్యారెంటీ. న్యూజిలాండ్‌తో మూడు, బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. వీటన్నిటికీ షమీ అందుబాటులో ఉంటే.. బుమ్రా, సిరాజ్ లతో అతడు చేయి కలిపితే భారత పేస్ బౌలింగ్ కు తిరుగుండదు.

Tags:    

Similar News