ఇప్పుడు పంచ్ ఇవ్వాల్సింది ఆ 2 నగరాల ముస్లింలే!

చెత్తబుద్ధిని ప్రదర్శించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు ముస్తాక్ అహ్మద్ కు చెప్పుతో బదులివ్వాల్సిన సమయం వచ్చేసింది. నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్న అతగాడికి.

Update: 2023-10-02 04:05 GMT

చెత్తబుద్ధిని ప్రదర్శించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు ముస్తాక్ అహ్మద్ కు చెప్పుతో బదులివ్వాల్సిన సమయం వచ్చేసింది. నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్న అతగాడికి.. లాగి పెట్టి రెండు పీకినట్లుగా రియాక్టు కావాల్సిందే. తొండి మాటలతో హద్దులు దాటేస్తూ.. మిగిలిన వారి మనసుల్లో విషం జల్లేలా ప్రయత్నిస్తున్న అతగాడికి సరైన రీతిలో బుద్ది చెప్పాల్సిన బాధ్యత ఆ రెండు మహానగరాల ముస్లిం మీద ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాడెవడో దారిన పోయేటోడు ఒక మాట అంటే.. తామెందుకు రియాక్టు కావాలన్నట్లుగా భావించకూడదు. ఎందుకంటే.. ఇలాంటి వాటికి చెప్పుతో తెగేలా మాటల స్పందన ఉంటే.. మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఆలోచన రావటానికి సైతం భయపడాల్సిన అవసరం ఉంది.

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం ఇటీవల పాక్ క్రికెట్ టీం భారత్ లోకి అడుగు పెట్టిన వేళ.. వారికి హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. దీంతో.. పాక్ జట్టు ఆనందానికి గురైంది. తాము ఏ మాత్రం ఇంతటి ఘన స్వాగతాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. ఈ ఉదంతాన్ని అసరాగా చేసుకున్న పాక్ మాజీ ప్లేయర్ ముస్తాక్ అహ్మద్ తన చెత్తబుద్ధిని బయటపెడుతూ.. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు.

భారత్ లోని రెండు మహానగరాల ముస్లింలు ఎప్పుడూ పాకిస్థాన్ కు మద్దతుగా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి అతగాడి చెత్త మాటలకు.. రెండు నగరాల్లోని ముస్లింలు తమ నిజాయితీని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కాకుంటే.. ఇలాంటి వాటిని చెత్త వాగుడుగా వదిలేయొచ్చు. కానీ.. అలా వదిలేస్తే.. అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వటంతో పాటు.. ఇరు మతాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకొని దుర్మార్గులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇంతకీ ముస్తాక్ అహ్మద్ ఏమన్నారన్నది చూస్తే.. అతగాడి విషపు ఆలోచనలు ఇట్టే అర్థమవుతాయి. భారతదేశంలోని అహ్మదాబాద్.. హైదారాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ముస్లింలు ఎక్కువ మంది ఉంటారని.. వారిలో చాలామంది పాకిస్థాన్ కే సపోర్టు చేస్తారన్నారు. "హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పాక్ టీంకు మంచి మద్దతు దక్కటానికి కారణం ఇదే. ఈ వరల్డ్ కప్ లో అహ్మదాబాద్ లో పాకిస్థాన్ కు మద్దతు దక్కుతుందని ఆశిస్తున్నా.పాక్ వార్తా చానల్ లో జరిగిన టీవీ చర్చా కార్యక్రమంలో ప్యానలిస్టుగా మాట్లాడుతున్న వేళ.. ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ లోని హిందూ - ముస్లింల మధ్య అంతరాలు తెచ్చేలా మాట్లాడే ఇలాంటి చెత్తవాగుడు కన్నా.. తమ దేశంలోని పరిస్థితుల గురించి కాస్తంత ఆలోచించి మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. ఇలాంటి వారి మాటలకు చెప్పు తీసి కొట్టేలా రియాక్టు అయితే.. మరింత బాగుండటంతో పాటు.. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడే వారికి కనీస మర్యాద భారత్ లో దక్కదన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. కాదంటారా?

Tags:    

Similar News