పంజాబ్ వర్సెస్ గుజరాత్... ఈ మ్యాచ్ లో హ్యాట్ ఫేవరెట్ ఎవరంటే...?

మరోవైపు గుజరాత్ తమ 7 మ్యాచ్‌ లలో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

Update: 2024-04-21 04:42 GMT

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మ్యాచ్ నెంబర్ 37.. గుజరాత్ వర్సెస్ పంజాబ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. ఇక ఈ సీజన్ లో పంజాబ్... 7 మ్యాచ్‌ ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ తమ 7 మ్యాచ్‌ లలో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

పంజాబ్ టీం విషయానికొస్తే... శశాంక్ సింగ్ 7 మ్యాచ్ లు ఆడి 187 పరుగులు చేయగా.. అశుతోష్ శర్మ 4 మ్యాచ్ లు ఆడి 156, శిఖర్ ధావన్ 5 మ్యాచ్ లు ఆడి 152 పరుగులు సాధించాడు. బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో నిలకడగా రాణిస్తున్న రబాడా, సాం కురేన్ లు తలో పదేసి వికెట్లు తీసుకున్నారు. ఇద్దరూ ఏడేసి మ్యాచ్ లు ఆడారు.

గాయం కారణంగా శిఖర్ ధావన్ లేకపోవడం పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ ను దెబ్బతీస్తోందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌ లోనూ అతడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ సమయంలో ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుందని అంటున్నారు.

ఇక గుజరాత్ విషయానికొస్తే... శుభ్ మన్ గిల్ 7 మ్యాచ్ లు ఆడి 263 పరుగులు సాధించగా.. సాయి సుదర్శన్ 238, రాహుల్ తివాటియా 113 పరుగులు సాధించారు. ఇక బౌలింగ్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే... మోహిత్ శర్మ 8 వికెట్లు, రషీద్ ఖాన్ 7 వికెట్లు దక్కించుకున్నారు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

పంజాబ్, గుజరాత్‌ లు ఇప్పటి వరకు నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో రెండు జట్లూ తలో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించాయి. ఈ క్రమంలో గుజరాత్ పై ఇప్పటివరకు పంజాబ్ అత్యధిక స్కోరు 200 కాగా... ఇది వారు ఆడిన ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌ లోనే వచ్చింది. ఏప్రిల్ 4 న జరిగిన మ్యాచ్‌ లో గుజరాత్ 199 పరుగులు చేయగా... చివరి బంతికి పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్:

మొహాలిలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బ్యాటర్‌ కు అనుకూలమైన పిచ్‌ లను అందిస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 18న ముంబైతో పంజాబ్ ఆడింది. ఈ మ్యాచ్ లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేయగా... అశుతోష్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు సాధించాడు.

Tags:    

Similar News