'83లో పుట్టలేదు.. '11టీంలో సగంమంది లేరు.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో లీగ్ దశలో టీం ఇండియా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే

Update: 2023-11-15 04:15 GMT

తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో లీగ్ దశలో టీం ఇండియా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఫలితంగా టైటిల్‌ రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ముంబయి వేదికగా న్యూజిలాండ్ తో సెమీస్‌ లో తలపడనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అవును... ఈ వరల్డ్ కప్ లో చరిత్రలో ఘనంగా నిలిచిపోయే ఫెర్మార్మెన్స్ తో ఆకట్టుకున్న టీం ఇండియా నేడు కివీస్ తో సెమీఫైనల్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన కెప్టెన్ రోహిత్... ప్రస్తుతం తమ దృష్టి పూర్తిగా కివీస్‌ పై గెలుపు మీదే ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాత రికార్డులు ప్రధాన పాత్ర పోషించవని పేర్కొన్నాడు. ఈ టోర్నీ మొదటి మ్యాచ్ లో ఎలాంటి మైడ్ సెట్ తో ఉన్నామో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్లు తెలిపాడు.

ఈ సందర్భంగా నేడు ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ కు వేదికైన వాంఖడే పిచ్ తో తనకున్న అనుభవాలౌ షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా... ఈ మైదానంలో తాను ఎన్నో మ్యాచ్ లు ఆడినట్లు తెలిపిన రోహిత్... ఈ పిచ్ పై టాస్ అనేది అంత కీలకం కాదని చెప్పుకొచ్చాడు. ఇక సెమీస్ కోసం ఆడే తుది జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండవని అన్నారు.

ఇదే సమయంలో సెమీస్ కి వచ్చేశామనే స్థాయిలో మైడ్ సెట్ ఏమీ మారలేదని చెప్పిన రోహిత్ ఈ ప్రపంచకప్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నామో అదే విధంగా ఉన్నట్లు తెలిపాడూ. అయితే హార్దిక్ పాండ్య గాయపడిన తర్వాత కాంబినేషన్ మారిపోయిందని.. మొదటి మ్యాచ్‌ నుంచి బౌలింగ్ చేయడానికి పార్ట్‌ టైం బౌలర్లను ఉపయోగించాలనుకున్నామని అన్నాడు! అయితే 6వ బౌలర్ ఉండటం మంచిదే కానీ... ఆ పరిస్థితి రావొద్దని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు.

ఇక ఒకసారి గతానికి వెళ్లిన హిట్ మ్యాన్... 1983లో భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలిచిందని.. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్‌ ఆడుతున్నవారిలో ఒక్కరు కూడా అప్పటికి పుట్టలేదని తెలిపాడు. ఇదే సమయ్యంలో 2011లోనూ ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆడినవారిలో ఇప్పుడు సుమారు సగం మంది ఈ జట్టులో లేరని అన్నాడు. ఇప్పుడు టీంలోని ప్రతీ ఒక్కరూ గత గొప్పలమీద దృష్టి కాకుండా... కేవలం కివీస్ పై గెలవడం మీదే పూర్తి దృష్టి పెట్టినట్లు చెబుతున్నాడు.

కాగా... ఈ వరల్డ్ కప్ లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ లలోనూ టీం ఇండియా టూ బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ లలో బెస్ట్ ఫెర్మార్మెన్స్ కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో బ్యాట్స్ మెన్ గా మంచి మార్కులు సంపాదించుకున్న రోహిత్ శర్మ... కెప్టెన్ గా మరింత గుడ్ నేం సంపాదించుకున్నాడంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

Tags:    

Similar News