క్రికెట్ ఇలా కూడా ఆడతారా.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం!

శనివారం రాత్రి శ్రీలంక బౌలర్లు భోజనం చేయలేదట!

Update: 2023-10-08 06:58 GMT

ఎంత ప్రపంచ కప్ అయితే మాత్రం మరీ ఇలా ఆడతారా... బౌలర్లను మానసిక క్షోభకు గురిచేస్తారా... వాళ్లు ఆ మ్యాచ్ అయిన తర్వాత ఆ నైట్ భోజనం చేసి ఉండరన్నా అతిశయోక్తి కాదేమో... ఇలా సాగింది ప్రపంచకప్ లో సఫారీల విధ్వంసం. ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ సెంచరీలు నమోదు చేశారు. అందులో ఒకటి వరల్డ్ రికార్డ్ కూడా!

అవును... ప్రపంచకప్‌ 2023లో తొలి మూడు మ్యాచ్‌ లూ అంతంతమాత్రం ప్రదర్శనతో నిరాశ పరిచాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంల్మో... క్రికెట్ అభిమానులకు నాలుగో మ్యాచ్‌ అసలైన రసవత్తర వినోదాన్ని అందించింది. వార్ వన్ సైడ్ అంటే ఏమిటో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చూపించారు. బాల్ వేయడం ఆలస్యం.. కెమెరాలు, ప్రేక్షకుల కళ్లూ బౌడరీలు వైపు చూడటం మినహా మరో ఆప్షన్ లేదన్నట్లుగా తయారైంది పరిస్థితి.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఇంత విధ్వంసంగా సాగింది. ఇన్నింగ్స్‌ లో 14 సిక్స్‌ లు, 45 ఫోర్లు నమోదయ్యాయంటే బ్యాటర్లు ఎంత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.. అదే సమయంలో అంపైర్లకు ఏ స్థాయిలో ఎక్సర్ సైజ్ అయిపోయి ఉంటుందో ఆలోచించొచ్చు. ఈ సందర్భంగా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక నిర్ణాయాన్ని తప్పుపడుతున్నట్లుగా దక్షిణాఫ్రికా బ్యాట్ మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇందులో భాగంగా సౌతాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. మార్‌ క్రమ్‌ (106: 54 బంతుల్లో 14×4, 3×6), డికాక్‌ (100: 84 బంతుల్లో 12×4, 3×6), వాండర్‌ డసెన్‌ (108: 110 బంతుల్లో 13×4, 2×6) రెచ్చిపోయారు.

ఇలా ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక స్కోరు ను ఛేధించడానికి శ్రీలంక బ్యాటర్లు మైదానంలో అడుగుపెట్టారు. అయితే కళ్లముందు భారీ స్కోరు కనిపించడంతో ఛేదనలో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటై చతికిలపడింది. శ్రీలంక బ్యాట్స్ మెన్స్ లో కుశాల్‌ మెండిస్‌ (76), అసలంక (79), శానక (68) పోరాడిన ప్రయోజనం దక్కలేదు.

ఈ మ్యాచ్ లో 49 బంతుల్లో సెంచరీ చేసి, ప్రపంచకప్‌ లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డ్ నమోదు చేసిన మార్క్‌ రమ్‌ "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డు లభించింది. 428/5 వరల్డ్‌ కప్‌ లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అయితే ఓవరాల్‌ గా వన్డేల్లో ఇది 9వ అత్యధిక స్కోరు.

ఇక ప్రపంచకప్‌ లో ఒక ఇన్నింగ్స్‌ లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కాగా... ఓవరాల్‌ గా వన్డే చరిత్రలో ఇది నాలుగో సారి. అయితే... ఇందులో మూడు దక్షిణాఫ్రికావే కావడం గమనార్హం.

మరోపక్క... ఇప్పటివరకూ జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్ లలోనూ స్టేడియంలు ఖాళీగా ఉన్నా సంగతి తెలిసిందే. అయితే అందరిలో రావాల్సిన ఉత్సాహమంతా వచ్చే మ్యాచ్ కోసం చెన్నైలోని చెపాక్‌ స్టేడియం రెడీ అయిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతోంది!

Tags:    

Similar News