ఐపీఎల్ డేట్లు వచ్చేశాయ్.. వచ్చే 3 సీజన్లకూ.. ఈసారి 8 రోజుల ముందే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఎన్నో మార్పులు.. అంతకుమించిన హంగమాతో అభిమానులను అలరించనుంది..

Update: 2024-11-22 09:43 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఎన్నో మార్పులు.. అంతకుమించిన హంగమాతో అభిమానులను అలరించనుంది.. దీనికి ముందు మరో రెండు రోజుల్లో జరిగే మెగా వేలం మరింత మజా అందించడం ఖాయం. పది జట్లలో నాలుగు జట్లకు కెప్టెన్లు మారారు.. పది జట్లు సగటున ఐదుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్నాయి. కొన్నిటి దగ్గర భారీగా డబ్బుంది. మరికొన్ని భారీగా డబ్బు ఖర్చు పెట్టే ప్లానింగ్ లో ఉన్నాయి. మరి.. అసలు సీజన్ స్టార్ట్ ఎప్పుడు?

8 రోజుల ముందే..

2024లో ఐపీఎల్ కు మినీ వేలం జరిగింది. ఇందులోనే ఆస్ట్రేలియా పేస్ ద్వయం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రూ.20 కోట్లు, రూ.25 కోట్లకు కొనుగోలు చేశాయి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్. మరి, రిషభ్ పంత్ వంటి సూపర్ హిట్టర్ మెగా వేలంలో నిలిచిన వేళ ఇంకెంత కుమ్మరిస్తాయో..? కాగా, 2024 సీజన్ లో మార్చి 22న ఐపీఎల్ మొదలైంది. మే 26వ తేదీ వరకు టోర్నీ సాగింది. అంటే 2 నెలల 4 రోజులు. 64 రోజులు.

ఈసారి 71 రోజులు

గత సీజన్ తో పోలిస్తే ఈసారి మాత్రం 8 రోజుల ముందుగానే ఐపీఎల్ రానుంది. చలి కాలం వెళ్లిపోయి అలా వేసవి మొదలవందో లేదో..? ఆ నులివెచ్చటి వాతావరణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ షురూ కానుంది. మార్చి 14 నుంచి ధనాధన్ ధమాకా ఢంకా మోగనుంది. మే 25 వరకు సాగనుంది. మొత్తమ్మీద 71 రోజుల పాటు సీజన్ నడవనుంది. తొలిసారిగా ఐపీఎల్ సీజన్ 70 రోజులకు మించి సాగనుండడం విశేషం.

వచ్చే మూడు సీజన్లకూ..

అనుకోకుండా.. చడీచప్పుడు లేకుండా.. ఐపీఎల్ 18 సీజన్ తో పాటు వచ్చే రెండు సీజన్లకు సంబంధించి తేదీలను విడుదల చేశారు. 2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31, 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు నడవనుంది. అంటే.. వచ్చే ఏడాది 2 నెలల 16 రోజులు, ఆపై వచ్చే ఏడాది 2 నెలల 17 రోజులు కొనసాగునుంది. ఈ మేరకు బీసీసీఐ.. ఆయా ఫ్రాంచైజీలకు ఈ మెయిల్ చేసింది.

ఈ ఏడాది 75 మ్యాచ్ లు.. ఆపై 84, 94

వచ్చే మార్చి 14 నుంచి మొదలయ్యే సీజన్ లో 74 మ్యాచ్ లు ఉన్నాయి. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారీ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, 2025, 2026 సంవత్సరాల్లో రోజులు పెరిగిన నేపథ్యంలో 84 మ్యాచ్ లు, 94 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News