ఓటీటీలోనూ 'లక్కీ భాస్కర్' లక్..!
తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో సైతం లక్కీ భాస్కర్ సినిమాకు మంచి స్పందన దక్కింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొంది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ విడుదల అయింది. సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. దాంతో మొదటి నాలుగు వారాల్లో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అదే రోజు మరో రెండు సినిమాలు వచ్చి, పాజిటివ్ టాక్ దక్కించుకున్నా లక్కీ భాస్కర్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం జరిగింది.
పీరియాడిక్ డ్రామాగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర మధ్యతరగతి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. థియేటర్ రిలీజ్ అయిన సమయంలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో సైతం లక్కీ భాస్కర్ సినిమాకు మంచి స్పందన దక్కింది. తెలుగుతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో, హిందీలోనూ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో ఇండియా వ్యాప్తంగా నెం.1 స్థానంలో లక్కీ భాస్కర్ ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలో జాతీయ స్థాయిలో నెం.1గా ట్రెండ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
కేవలం ఇండియాలోనే కాకుండా 15 దేశాల్లోనూ టాప్ 10లో లక్కీ భాస్కర్ ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులు లక్కీ భాస్కర్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో తెగ చర్చ జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల వీడియోలు వైరల్ కావడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తం అవుతోంది. థియేటర్లో చూసిన వారు సైతం ఓటీటీ ద్వారా చూసేందుకు ఆసక్తి చూపిస్తూ మరోసారి స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లక్కీ భాస్కర్‌కి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా లక్ కలిసి వచ్చి టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
దుల్కర్ సల్మాన్‌ను ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయిగా చిత్ర దర్శకుడు లక్కీ భాస్కర్లో చూపించడం జరిగింది. అత్యంత గడ్డు జీవితం సాగిస్తూ, దిగువ మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న బ్యాంక్ ఎంప్లాయి ఎలా తన తెలివితో బ్యాంక్ డబ్బును ఉపయోగించాడు, అతి పెద్ద స్కాం నుంచి ఎలా బయట పడ్డాడు అనేది సినిమా కథాంశం. జీరో స్థాయి నుంచి వంద కోట్ల సంపాదన పొందే వరకు అతడి జర్నీ, చాలా తెలివైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు వెంకీ అట్లూరి చూపించిన తీరు నిజంగా అద్భుతం అంటూ రివ్యూవర్స్‌తో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.