నెట్ ఫ్లిక్స్ '2025'.. మామూలు ట్రీట్స్ కావు ఇవీ!
ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మెప్పించే ఎన్నో వెబ్ సిరీసులు నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
ఓటీటీలకు రోజురోజుకు వేరే లెవెల్ లో ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. సింపుల్ గా చెప్పాలంటే థియేటర్లకు ఆల్టర్నెట్ గా మారిపోయాయి. ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఆడియన్స్ ను మెప్పించేలా కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తూ అదరగొడుతున్నాయి. క్రమంగా వ్యూయర్స్ ను పెంచుకుంటున్నాయి.
సినిమాలతోపాటు క్రేజీ వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొస్తూ మెప్పిస్తున్నాయి ఓటీటీలు. అయితే వాటిలో సాలిడ్ కంటెంట్ ను తీసుకొస్తున్న టాప్ ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మెప్పించే ఎన్నో వెబ్ సిరీసులు నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా స్క్విడ్ గేమ్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రావడంతో నెట్ ఫ్లిక్స్ పేరు మరోసారి మార్మోగుతోంది. నిజానికి స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ కేవలం ఒక్కరోజులోనే అదిరిపోయే రికార్డులు సాధించింది. దీంతో సీజన్-2పై భారీ బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లే సీజన్ 2 ఏకంగా 92 దేశాల్లో నాన్ స్టాప్ గా నెo.1 స్థానంలో కొనసాగుతోంది.
మొదటి వారంలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న సిరీస్ గా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దాంతోపాటు మరిన్ని ఘనతలు సాధించింది. దీంతో సీజన్ 3 ఎప్పుడని అంతా డిస్కస్ చేసుకోగా.. 2025లోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసేసింది నెట్ ఫ్లిక్స్. సీజన్ 1కు 2కు ఉన్నంత గ్యాప్ ను తీసుకోకుండా ఉండాలని ఫిక్స్ అయినట్లుంది.
అయితే స్క్విడ్ గేమ్ సీజన్ 3 తోపాటు మరో రెండు అవైటెడ్ వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ ను కూడా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. అవి కూడా 2025లోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. వెడ్నెస్ డే 2, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. వాటితోపాటు మరిన్ని సినిమాలను ఎప్పటి లాగే తీసుకురానుంది.
మొత్తానికి 2025లో తమ యూజర్స్ కు నెట్ ఫ్లిక్స్ వేరే లెవెల్ ట్రీట్స్ ఇవ్వనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయనున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే బోలెడు మంచి క్వాలిటీ కంటెంట్ ను అందించిన నెట్ ఫ్లిక్స్.. ఫ్యూచర్ లో మరింతగా అలరించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.