ఉత్తరాదినా ట్యాలెంటెడ్ సాయిపల్లవి హవా
ఇలాంటి ఒరవడిలోనే సాయిపల్లవి నటించిన ఓ చిత్రం ఓటీటీలోను హవా సాగిస్తోంది. దాదాపు ఐదారేళ్ల క్రితం రిలీజైన ఈ చిత్రంలో సాయిపల్లవితో పాటు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రధారిగా నటించాడు.
ఒక గొప్ప నటి లేదా ప్రతిభావనికి గుర్తింపు రావడం కష్టమేమీ కాదు. అది థియేట్రికల్ రిలీజ్ లేదా ఓటీటీ సినిమా.. ఫార్మాట్ ఏదైనా కానీ ప్రతిభను గుర్తించేందుకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్నారు. ఇంతకుముందులా ఉత్తరాది దక్షిణాది అనే విభేధం లేదు. నార్త్ ఆడియెన్ దక్షిణాది సినిమాలకు ప్రాంతీయ స్టార్లకు బ్రహ్మరథం పడుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. దేశంలో మంచి కంటెంట్ తో సినిమాలు వస్తే చూసేందుకు ప్రాంతీయ విభేధం లేనే లేదు.
ఇలాంటి ఒరవడిలోనే సాయిపల్లవి నటించిన ఓ చిత్రం ఓటీటీలోను హవా సాగిస్తోంది. దాదాపు ఐదారేళ్ల క్రితం రిలీజైన ఈ చిత్రంలో సాయిపల్లవితో పాటు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రధారిగా నటించాడు. అథిరన్ అనేది టైటిల్. ఇది థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కగా, ఇందులో ఫహద్, సాయిపల్లవి నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ఇద్దరి నటనా గూస్ బంప్స్ తెచ్చిందన్న ప్రశంసలు దక్కాయి. మరోవైపు ఈ సినిమా గ్రిప్పింగ్ కథాంశం, దర్శకుడి పనితనం వెరసి అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ మలయాళ చిత్రం ఓటీటీలో గొప్ప ఆదరణ దక్కించుకుంటోంది. ఇది OTT చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది.
మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా వేవ్స్ క్రియేట్ చేయడం ఇప్పుడే ప్రారంభం కాలేదు. చాలా సినిమాలు జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇప్పుడు అదే కేటగిరీలో సాయిపల్లవి సినిమా చేరడం ఆసక్తిని కలిగించేదే. సాయిపల్లవి తదుపరి రామాయణం లాంటి భారీ కళాఖండంలో నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కాకుండానే తనకు ఉత్తరాదినా మంచి గుర్తింపు తెచ్చింది ఈ థ్రిల్లర్ మూవీ.
ఈ సినిమా కథ ఆటిస్టిక్ రోగి విషయంలో పనిచేసే మానసిక వైద్యుడి చుట్టూ తిరుగుతుంది. సినిమా ఆద్యంతం రకరకాల గందరగోళ సమస్యలను టచ్ చేస్తూ క్లైమాక్స్ లో అద్భుతం అనిపిస్తుంది. అంత గ్రిప్పింగ్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అతుల్ కులకర్ణి, శాంతి కృష్ణ, సుదేవ్ నాయర్ వంటి ప్రతిభావంతులు తమ పాత్రల్లో జీవించారు. ఇప్పుడు ఉత్తరాది వారిని ఇది అలరిస్తోంది. హాట్‌స్టార్‌లో అత్యధికంగా ప్రసారం అయిన చిత్రాలలో అగ్రస్థానంలో ఉంది.