ఫేస్‌ బుక్‌ లో ఇక‌.. లైవ్ స్ట్రీమింగ్

Update: 2015-08-09 11:14 GMT
ఇవాల్టి రోజున సోష‌ల్ నెట్ వర్క్  లో జ‌నాలు ఎంత‌గా బిజీ అయిపోతున్న‌ది తెలిసిందే. కుటుంబ స‌భ్యులతో కంటే సోష‌ల్ మీడియాతో బిజీబిజీగా గడపటం ఇప్పుడు చాలా కామ‌న్ గా క‌నిపిస్తోంది.

మొబైల్ లో సోష‌ల్ నెట్ వర్క్  ను ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక‌సారి చెక్ చేస్తారంటూ ఈ మ‌ధ్యనే ఓ స‌ర్వే వెల్ల‌డించింది. సోష‌ల్ నెట్ వ‌ర్క్స్ తో ఇంత‌గా మ‌మేకం అవుతున్న నెటిజ‌న్ల‌ను మ‌రింత ఆక‌ట్టుకునేలా కొంగొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ప్ర‌ముఖ సోష‌ల్ నెట్ వర్క్  సైట్ ఫేస్ బుక్. తాజాగా త‌న ఖాతాదారుల‌కు స‌రికొత్త సేవ‌ల్ని అందించేందుకు సిద్ధం అవుతోంది.

ఫేస్‌ బుక్ ఖాతా నుంచి లైవ్ స్ట్రీమింగ్  వెసులుబాటు క‌ల్పిస్తూ ఫేస్ బుక్ ఏర్పాటు చేసింది.దీంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ ఫోటోలు.. వీడియోలు.. కామెంట్లు మాత్ర‌మే అప్ లోడ్ చేసే వారు.. ఇక‌పై త‌మ‌కు సంబంధించిన అంశాల్ని లైవ్ లో చూపించే వీలుంది. కాక‌పోతే.. ఈ స‌దుపాయాన్ని కేవ‌లం వెరిఫైడ్ ఖాతాలు.. ఫేస్‌ బుక్ పేజీలు ఉన్న వారికే స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు ఫేస్ బుక్ చెబుతోంది.

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు సోష‌ల్ మీడియాలో కొత్తేం కాదు.. ఇప్ప‌టికే ఇలాంటి సేవ‌ల్ని మీర్ క్యాట్ యాప్ అందిస్తోంది. దీనికి పోటీగా.. ట్విట్ట‌ర్ పెరిస్కోప్ ను కొనుగోలు చేసి.. సేవ‌ల్ని అందిస్తోంది. తాజాగా ఫేస్ బుక్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ఇవ్వ‌టంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ లైవ్‌ స్ట్రీమింగ్ లేని లోటు తీరిన‌ట్లు అయ్యింది. కాకుంటే.. ప‌రిమితులు వ‌ర్తిస్తాయ‌న్న లింకు పెట్ట‌టం ప‌లువుర్ని నిరాశ  ప‌రుస్తుంది. అంద‌రికి ఎప్ప‌టికి లైవ్ స్ట్రీమింగ్  ఇస్తారో..?
Tags:    

Similar News