విండోస్ 10లో ఆ లోపం ఉందంటున్న మొజిల్లా సీఈవో

Update: 2015-08-03 07:35 GMT
ఎన్నోరోజులుగా ఊరిస్తున్న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మార్కెట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన విండోస్ 10కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయని.. మంచి  ఆదరణ లభిస్తోందన్న వాదన ఉంది. విండోస్ 10ను తమ సిస్టంలో అప్ డేట్ చేసుకోవటానికి భారీగా నెటిజన్లు పోటీ పడటంతో.. ఆన్ లైన్ లో పెద్ద క్యూ నడుస్తుందన్న వాదన ఉంది.

విండోస్ 10పై ఇప్పటివరకూ పాజిటివ్ రివ్యూలు మాత్రమే రాగా.. తాజాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఇప్పటివరకూ పలువురు నిపుణులు వ్యక్తం చేసిన ఫిర్యాదుల మాదిరే.. మొజిల్లా సీఈవో క్రిస్ బియర్డ్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన తన బ్లాగులో విండోస్ 10లోని యూజర్ కంట్రోల్స్ సరిగా పని చేయటం లేదంటూ ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ఒక ఓపెన్ లెటర్ రాసేశారు. తన తాజా లేఖలో విండోస్ 10లోని లోపాల్ని ఆయన ఎత్తి చూపిస్తూ.. తన బ్లాగులో వివరంగా రాసేశారు. మరి.. దీనికి మైక్రోసాఫ్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో..?
Tags:    

Similar News