విండోస్ 10లో అసలేం ఉన్నాయ్..?

Update: 2015-08-05 06:45 GMT
ఎంతోకాలంగా ఊరిస్తోన్న విండోస్ 10 వచ్చేసింది. వారం క్రితం విడుదలైన విండోస్ 10 ఓఎస్ కు సానుకూల రివ్యూలే వచ్చాయి. ఊహించినదాని కంటే ఎక్కువగానే ఆదరణ పొందుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేసమయంలో విండోస్ 10 లో కొన్నిసాంతికేక సమస్యలు ఉన్నట్లుగా మొజిల్లా సీఈవో లాంటి వారు ఇప్పటికే తమ బ్లాగుల్లో ప్రస్తావించటం తెలిసిందే.

ఏది ఏమైనా విండోస్ 10.. తన గత వెర్షన్లతో పోలిస్తే మంచి రివ్యూలనే సొంతం చేసుకుంది. విండోస్ 10 కు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ సింగిల్ డిజిట్ లో ఓఎస్ లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. తన డబుల్ డిజిట్ ఓఎస్ ఇదే. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నుంచి రానున్న చివరి ఓఎస్ ఇదే. ఇకపై విండోస్ 10ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయటమే ఉంటుంది తప్పించి.. మరో కొత్త వెర్షన్ ఉండదని మైక్రోసాఫ్ట్ గతంలోనే ప్రకటించింది.

అంటే.. మైక్రోసాఫ్ట్ కు ఎంత నమ్మకం ఉంటే ఇలాంటి మాట చెబుతుంది..? ఇంతకీ విండోస్ 10లో అసలేముంది? అందులోని ఫీచర్ల గురించి చూస్తే..

1. ప్రస్తుతం విండోస్ 7.. విండోస్ 8.1 ఉపయోగిస్తున్న వారంతా ఈ కొత్త ఓఎస్ ను ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకునే వీలుంటుంది. కాకపోతే.. ఒక ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఊరికే ఏదీ ఎల్లకాలం దొరకదు కదా. రానున్న మూడేళ్లలో వంద కోట్ల డివైజ్ లలో దీన్ని ఉపయోగిస్తారన్నది మైక్రోసాఫ్ట్ అంచనా.

2. విండోస్ 10 లోకి మారాలని భావించే వారు మొదట గుర్తించాల్సిన అంశం.. విండోస్ 10లోకి మీ సిస్టం అప్ గ్రేడ్ కావాలంటే మీ కంఫ్యూటర్ కనీసం 1 జీహెచ్ జెడ్ ప్రాసెసర్.. కనీసం 1 జీబీ రామ్.. 16 జీబీ హార్డ్ డిస్క్ ఉండాలి. ఇవన్నీ బేసిక్ కాబట్టి. ప్రతి కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే.. భూమి పుట్టక ముందు నుంచి వినియోగిస్తున్న కంప్యూటర్లవిషయంలో మాత్రం ఇది ముందు తెలుసుకోవాలి. లేదంటే.. కొత్తదాని సంగతి తర్వాత.. ఉన్నది పోవటం ఖాయం.

3. విండోస్ 10ని ఇన్ స్టాల్ చేసుకోవాలనుకునే వారు.. ఇప్పటివరకూ ఉన్న సాఫ్ట్ వేర్లను తొలగించి.. మళ్లీ రీ ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మరిన్ని వివరాల్ని మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్ లో ముందుగా తెలుసుకొని పనిలోకి వెళితే బెటర్.

4. విండోస్ 10 ప్రాధమిక లక్ష్యం.. డెస్క్ టాప్.. ట్యాబ్ టెల్.. సెల్ ఫోన్ ఈ మూడింటిని వాడే యూజర్ ఏకకాలంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవడటం.

5. విండోస్ స్టోర్ లోని యూనివర్సిల్ యాప్స్ ను ఒకసారి డౌన్ లోడ్ చేసుకుంటే.. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని అన్ని డివైజ్ ల్లోకి ఇంటిగ్రేట్ అవుతాయి. ఇప్పటివరకూ డెస్క్ టాప్ లకు మాత్రమే వీలుండేది. తాజా వెర్షన్ లో ఏ డివైజ్ కు తగ్గట్లు ఆ డివైజ్ కు తగ్గ డిస్ ప్లేను విండోస్ 10 ఇస్తుంది.

6. విండోస్ 8లో టచ్ స్ర్కీన్ లో ఉపయోగించగలిగిన కొన్ని ఫుల్ స్ర్కీన్ అప్లికేషన్లను మైక్రోసాఫ్ట్ ప్రవేశ పెట్టింది. దీంతో.. డెస్క్ టాప్.. ట్యాబెలెట్.. స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి మార్పు లేకుండా ఉపయోగించుకునేలా రూపొందించారు.

7. తాజా ఓఎస్ లో స్నాప్ అనే అప్లికేషన్ ను బలోపేతం చేశారు.దీంతో.. నచ్చిన పద్ధతిలో డెస్క్ టాప్ పై అప్లికేషన్లను పెట్టుకునే సౌలభ్యం ఉంటుంది.

8. తన పాతతరం విండోస్ లోని స్టార్ట్ అప్ మెనూను విండోస్ 10లో ప్రవేశ పెట్టారు.

9. తాజా ఓఎస్ లో కార్టానా అనే కొత్త అప్లికేషన్ ఉంది. ఇది గొంతును గుర్తించి.. కమాండ్లను స్వీకరిస్తుంది. మన అవసరాలను ముందస్తుగా గుర్తించి సాయం చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక వాణిజ్య సంస్థకు మొయిల్ పంపాలంటే.. కార్టానా దాని మొయిల్ ఐడీని ఇవ్వటమే కాదు.. సైడ్ బార్ లో ఇంటర్నెట్ సాయంతో ఆ వాణిజ్య సంస్థకు సంబంధించిన వివరాల్ని సేకరించి పెడుతుంది.

10. ఈ కొత్త ఓఎస్ లో ఎడ్జ్ అనే కొత్త బ్రౌజర్ వచ్చి చేరింది. దీన్లో అత్యాధునిక బ్రౌజర్లో ఉన్న అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి.
Tags:    

Similar News