అసలు పాదాన్ని మరిపించే కృత్రిమ కాలు

Update: 2015-08-10 07:27 GMT
ప్రమాదాల్లో తీవ్రంగా గాయాల పాలైనప్పుడు.. సహజంగా ఉండే అవయువాల్ని తీసేయాల్సి ఉంటుంది. దీనికి బదులుగా.. కృత్రిమ అవయువాల్ని అమరుస్తుంటారు. పేరుకు తగ్గట్లే కృత్రిమ అవయువాల కారణంగా.. తాము కృత్రిమ బతుకు బతుకుతున్నామన్న భావన వారిని వెంటాడుతుంటుంది. ఈ వేదన వారి జీవితాల్లో నిత్యం వస్తూనే ఉంటుంది.

ఇలాంటి వేదనకు గురైన ఒక వ్యక్తి ఆలోచనల పుణ్యమా అని సరికొత్త ఆవిష్కరణకు అవకాశం ఇచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన రాంగీర్ అనే వ్యక్తికి ఏడేళ్ల కిందట ఒక ప్రమాదంలో తన కుడికాలును కోల్పోయాడు. దీంతో.. అతనికి కృత్రిమ కాలును ఏర్పాటు చేశారు. అయినప్పటకీ రాంగీర్ మనసు సంతృప్తి పడలేదు. తన సహజసిద్ధమైన కాలుకు.. కృత్రిమ కాలు గురించి పదే పదే ఆలోచించేవాడు.

తనకున్న బాధను ఆస్ట్రేలియాలోని కొందరు శాస్త్రవేత్తల్ని సంప్రదించాడు. తనకొచ్చిన ఇబ్బంది గురించి చెప్పి.. దానికి పరిష్కారం వెతకాలని కోరాడు. దీంతో.. శాస్త్రవేత్తలంతా మదింపు జరిపిన మీదట కొత్త పరికరాన్ని తయారు చేశారు. దీని ప్రత్యేక ఏమిటంటే.. కృత్రిమ కాలు.. చేయి లాంటి వాటికి దీన్ని వినియోగించొచ్చని చెబుతున్నారు.

సోల్ భాగంలో సెన్సర్ల ను ఏర్పాటు చేశారు. దీని సాయంతో వాటి మీద కాలు మీద పెట్టినప్పుడు.. వీటిల్లోని సెన్సర్లు యాక్టివ్ అవుతాయి. అవి మెదడుకు సంకేతాలు ఇవ్వటంతో పాటు..  అసలు సిసలు కాలుతో నడుస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో.. ఇంచుమించు అదే రీతిలో స్పర్శ భావనను మెదడు కలిగిస్తుందని  చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా సెన్సార్ సిస్టంతో ప్రమాదాల్లో అవయువాల్సి కోల్పోయి.. కృత్రిమ అవయువాలతో బతుకును వెళ్లదీసే వారి పాలిట ఆశా జ్యోతిగా తాజా పరికరం పని చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఒక వ్యక్తి వ్యధ.. సరికొత్త సాంకేతికతను అభివృద్ధికి కారణమైందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News