రోజులు మారుతున్నాయి. దానికి తగ్గట్లే.. అలవాట్లు.. అభిరుచుల్లో మార్పులు వచ్చేస్తున్నాయి. గతంలో నలుగురు కలిస్తే గలగలా మాట్లాడుకుంటూ సందడి.. సందడిగా ఉండేది. మరిప్పుడు.. అదే నలుగురు ఇప్పుడు కలిస్తే.. మొదటి పది నిమిషాలు సందడి ఉంటుంది. అంతలోనే ఎవరో ఒకరి సెల్ ఫోన్ మోగటం.. వారు ఆ కాల్ లో బిజీ అయిపోతే.. మరొకరికి ఇంకో అప్ డేట్ రావటం.. మరొకరు ఫేస్ బుక్ లోనో.. ట్విట్టర్ లోనూ బిజీ అయిపోతూ.. మళ్లీ నలుగురు ఒకే స్థితికి వచ్చేయటానికి ఓ పావుగంటో.. అరగంటో పట్టే పరిస్థితి.
అంతవరకూ ఎందుకు.. గతంలో బస్సుల్లో..రైళ్లల్లో ప్రయాణించే టప్పుడు పరిసరాల్ని చూసే వారు. ఇప్పుడు సీట్లో కూర్చున్నది మొదలు సెట్ ఫోన్ లో ఎంగేజ్ అయిపోతారు. పెద్దలే కాదు.. పిల్లల్లోనూ అదే పరిస్థితి.
ఎవరికైనా చిన్న పిల్లలకు సెల్ ఫోన్ దొరికితే వారు.. తమకెంతో ఇష్టమైన తల్లిదండ్రుల్ని సైతం మరిచిపోయి.. సెల్ ఫోన్ లో బిజీ అయిపోతారు. ఏ మాత్రం కల్మషం లేని పిల్లల్నే మాయదారి సెల్ ఫోన్ అంతలా అడిక్ట్ చేస్తే.. కుర్రాళ్ల మాటేమిటి?
తాజాగా గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు కోసం.. కోర్సులు అభ్యసించటానికి వచ్చే కుర్రాళ్లలో చాలానే మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఇంటికి దూరంగా ఉన్న వారి సంగతిని పక్కన పెడితే.. కాస్తంత దగ్గర్లో ఉన్న వారు.. సెలవు వస్తే.. తుర్రుమంటూ ఊళ్లకు పయనమయ్యేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. సెలవులువస్తే.. ఇంటికి వెళ్లటానికి తెగ బెంగ పడిపోతున్నారు.
ఎందుకంటే.. తాము ఊళ్లకు వెళితే.. ఇంటర్నెట్ సౌకర్యం అంతగా ఉండదని.. దీంతో.. తమ రోజువారీ కార్యకలాపాలు (సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో) భంగం వాటిల్లే ప్రమాదం ఉందని.. చాలామందిని మిస్ అవుతామన్న ఫీలింగ్ పెరిగిపోతుందట. దీంతో.. ఇంటర్నెట్ సౌకర్యం అంతగా లేని ప్రాంతాలకు చెందిన కుర్రాళ్లు.. సెలవు రోజుల్లో ఊళ్లకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడటం లేదట. గతంలో మాదిరి వారం.. పది రోజుల పాటు సెలవులు వస్తే.. ఎగిరిగంతేసే వారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా నీరసపడిపోతున్నారట. ఇదంతా నగరాలు.. పట్టన ప్రాంతాలకు చెందిన యూత్ ట్రెండ్ గా చెబుతున్నారు. మనిషి మనిషికి దూరం పెంచేసిన ఈ మాయదారి సెల్ ఫోన్ రానున్న రోజుల్లో మరెన్ని మార్పులు తెచ్చి పెడుతుందో..?