మైనారిటీలపై గురిపెట్టిందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదల

Update: 2023-07-25 07:42 GMT

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ మైనారిటీలపై ఓట్లపై గురిపెట్టినట్లు సమాచారం. తెలంగాణాలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముస్లిం ఓట్లతో పాటు క్రిస్తియన్ ఓట్లు కూడా ఉన్నాయి. అయితే రెండింటిలో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ. అందుకనే ఈ వర్గం ఓట్లను పార్టీ వైపుకు మళ్ళించేందుకు అవసరమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా ఓల్డ్ సిటిపై టార్గెట్ ఫిక్స్ చేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

ముస్లింఓట్లను ఎందుకు టార్గెట్ చేసిందంటే ఎంఐఎంను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి. ఎంఐఎంను దెబ్బకొట్టడం ద్వారా బీఆర్ఎస్ ను ఇరుకునపెట్టచ్చని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఓల్డ్ సిటిలో ఎంఐఎం గెలుస్తున్న ఏడు సీట్లలో ఎన్ని వీలైతే అన్నింటిలో పాగావేయాలని కమలనాదులు అనుకుంటున్నారు. ఒకటి ఓల్డ్ సిటిలో సీట్లు గెలవటం, రెండు ఎంఐఎం ఓట్లను తగ్గించటమే లక్ష్యాలుగా పెట్టుకుంది.

ఇందులో భాగంగానే బీజేపీ తరపున ఓల్డ్ సిటిలో ప్రచారం చేయటం కోసం బీజేపీ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లామ్ ను రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యిందట. జాఫర్ తో ఓల్డ్ సిటిలో ప్రచారం చేయించటంతో పాటు తెలంగాణాలో ముస్లింల ప్రాబల్యం ఉన్న అన్నీ నియోజకవర్గాల్లోను తిప్పాలని అనుకుంటున్నారు. జాఫర్ మాత్రమే కాకుండా కేంద్రమంత్రులుగా పనిచేసిన, ఎంపీలుగా ఉన్న ప్రముఖ ముస్లింలందరినీ రంగంలోకి దింపబోతున్నది.

మొత్తంమీద బీజేపీ మైనారిటి ఓట్లకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. బీజేపీ ముస్లిం, క్రిస్తియన్ వర్గాలకు దూరమనే ముద్రను చెరిపేసుకోవటం కోసం అందుబాటులో ఉన్న అన్నీ ప్రయత్నాలను చేస్తున్నది. అయితే ఇక్కడే బీజేపీ వైఖరిపైన కాస్త అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే బీజేపీ తరపున ఓల్డ్ సిటిలో ఎంఐఎంపై తిరుగులేని పోరాటం చేస్తున్నది గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ మాత్రమే.

అలాంటి రాజాసింగ్ ను పార్టీ చాలాకాలం క్రిందటే సస్పెండ్ చేసింది. సస్పెన్షను ఎత్తేయాలని రాజాసింగ్ ఎన్నిసార్లు అడుగుతున్నా బీజేపీ అగ్రనేతలు పట్టించుకోవటంలేదు. ఇక్కడే బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News