చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న సీఎం కేసీఆర్

సోమవారం విడుదల చేయాలని సీఎస్ శాంతకుమారిని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకున్నారు

Update: 2023-07-24 05:03 GMT

మరో నాలుగు నెలలు. సరిగ్గా రోజుల్ని లెక్కేస్తే.. అంతకంతే తక్కువ రోజుల్లోకి వచ్చేశాయి సార్వత్రిక ఎన్నికలు. గత ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్ని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేసిన ఎన్నికల్లో విజయాన్ని సాధించటం ద్వారా హ్యాట్రిక్ రికార్డును తన ఖాతాలో వేసుకోవటంతో పాటు.. తిరుగులేని అదికారపక్షంగా నిలవాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. అందుకు అవకాశం ఉన్న ఏ చిన్న ఛాన్సుని విడిచిపెట్టకుండా ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా అలాంటి నిర్ణయాన్నే ప్రకటించారు గులాబీ బాస్. ఈసారి ఎన్నికలు గతానికిమించిన అధిక్యతను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. వేర్వేరు వర్గాల వారిని సంతృప్తి పరిచేందుకు ఉన్న అవకాశాల్ని ఇప్పటికే సెర్చ్ చేస్తున్న కేసీఆర్.. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకొన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. దివ్యాంగులకు వెయ్యి రూపాయిల పెన్షన్ ను పెంచటంతో పాటు..గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంటున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం అందరికి సెలవు అయినప్పటికీ.. సీఎం కేసీఆర్ మాత్రం కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలుగా పని చేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించటం ద్వారా మనసు దోచేసే నిర్ణయాన్ని తీసుకున్నారు.

అంతేకాదు.. వీఆర్ ఏ అర్హతలను ఆధారంగా చేసుకొని మున్సిపాలిటీ.. మిషన్ భగీరథ.. ఇరిగేషన్ లాంటి శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని.. వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వం నియమిస్తుంది. తాను చెబుతున్న అంశాలకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని సీఎస్ శాంతకుమారిని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాజాగా తీసుకున్న నిర్ణయం చారిత్రక నిర్ణయంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసినప్పుడు.. కొండ మీద ఉన్న కోతిని సైతం కిందకు దించేపి ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి భారీగానే కసరత్తులు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజా నిర్ణయమని చెబుతున్నారు.

ఈ నిర్ణయంతో 20,555 మంది వీఆర్ఏల సుడి తిరిగినట్లే. ఇంతకీ వీరిని ఎలా సర్దుబాటు చేస్తారు? అందుకు అనుసరిస్తున్న ప్రాసెస్ ఏంటి? అన్న విషయంలోకి వెళితే.. వీఆర్ఏలలో ఏడో తరగతి నుంచి ఇంటర్ పాసైన వారి వరకున్నారు. డిగ్రీ.. ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నప్పటికి వారి సంఖ్య తక్కువ. వీరికున్న విద్యార్హత ఆధారంగా చేసుకొని ఉద్యోగ కేటగిరి నిర్ణయిస్తారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారం చూస్తే.. ఉన్నత విద్యను అభ్యసించి.. అర్హులైన వారికి ప్రమోషన్లతో పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అదే సమయంలో 61 ఏళ్ల పైబడి.. సర్వీసులో మరణించిన వారి వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎంతోకాలంగా నలుగుతున్న వీఆర్ఏల ఇష్యూ పెద్ద సారు తీసుకున్న తాజా నిర్ణయంతో పరిష్కారమైనట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News