సునీల్ పోక..సెంథిల్ రాక..కారణం రేవంత్?
సునీల్ కానుగోలు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి.. ఆ స్థానంలో మరొకరు రావడానికి కారణం ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని తెలుస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యూహకర్త రాబోతున్నారని.. కర్ణాటకలో సక్సెస్ అయిన సునీల్ కానుగోలు ను తప్పుకుంటున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి ఒకరిని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్తగా తీసుకువస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనికంతటికీ రేవంత్ రెడ్డే కారణం అని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి.. ఆ స్థానంలో మరొకరు రావడానికి కారణం ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని తెలుస్తుంది. దీనికి కారణం వీరిద్దరి మధ్య సఖ్యతా లోపమని కొందరంటుంటే.. రేవంత్ వ్యవహార శైలి నచ్చకే సునీల్ కర్ణాటకకు వెళ్లిపోయారని మరికొందమంది అంటున్నారని తెలుస్తుంది.
అవును... తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో సునీల్ కానుగోలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఫలితంగా... ఆయనను సీఎం సలహాదారుడిగా సిద్దరామయ్య నియమించుకున్నారు.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయనను వ్యూహకర్తగా నియమించాలని పార్టీ భావించింది. ఇందులో భాగంగా... మొదట్లో రేవంత్ రెడ్డి.. సునీల్ కానుగోలుపై సానుకూల అభిప్రాయమే కలిగి ఉన్నాడని అంటున్నారు. అయితే అనంతరకాలంలో అనుకున్న స్థాయిలో సునీల్ ఫెర్ఫార్మెన్స్ లేదని రేవంత్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది.
ఇదే సమయంలో రేవంత్ వ్యవహార శైలి.. సొంత పెత్తనం.. వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగ వేదికలపై బయటపెట్టడం.. హైకమాండ్ కి పంపే నివేధికల్లో తన అభ్యర్థులపై సానుకూల రిపోర్ట్స్ ఇవ్వని అడుతున్నారని సునీల్ సైతం ఇబ్బందిగా ఫీలయ్యారన్ని అంటున్నారు.
ఉదాహరణకు... అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, సీఎం అభ్యర్థిని ప్రకటించడం వంటి పనులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క వంటి సీనియర్లు బహిరంగంగానే రేవంత్ వైఖరిని ఖండించారు. ఈ విషయంలో రేవంత్ అలా వ్యాఖ్యానించడం కూడా సునీల్ కు నచ్చలేదని అంటున్నారు.
మరోపక్క ఉచిత విద్యుత్ సమస్యకు సంబంధించి సునీల్ కానుగోలు నష్ట నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించలేదని ఆరోపిస్తున్నారంట. దీంతో కలత చెందారో ఏమో కానీ... తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే సునీల్ బెంగుళూరు వెళ్లిపోయాడని.. ఫోన్ లో కూడా టి.కాంగ్రెస్ నేతలకు అందుబాటులో లేరని అంటున్నారు.
దీంతో ఈ పరిస్థితిని గమనించిన అధిష్టాణం ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించిందని అంటున్నారు. ఇందులో భాగంగా... మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఎంపికచేసిందట. ఈయన ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారని తెలుస్తుంది.
ఈయనకు సంబంధించిన ఫైనల్ నిర్ణయంపై ఈ వారం చివరిలో లేదా వచ్చే ప్రారంభంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ మార్పు సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందనేది వేచి చూడాలి.