గాల్లో విమానం... బాత్ రూం లో శృంగారం... వీడియో వైరల్!

కాసేపటికి సిబ్బందిలో ఒకరు తలుపు తెరవమని కోరగా.. ఆ జంట ఏ మాత్రం స్పందించలేదు. అనంతరం కాస్త గట్టిగానే పిలిచారు

Update: 2023-09-13 14:30 GMT

విమానంలో విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రకరకాల పనికిమాలిన వేషాలు వేస్తూ... తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న విమాన ప్రయాణికులు ఎంతో మంది ఈ మధ్యకాలంలో అరెస్ట్ అవుతున్నారు! ఈ సమయంలో తాజాగా విమానం గాల్లో ఉండగా బాత్ రూం లో దురిన ఒక జంట యవ్వారం వెలుగుచూసింది.

అవును... "విమానాల్లో వింత వేషాలు" అనే సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా విమానం గాల్లో ఉండగా.. ఓ జంట బాత్‌ రూంలో దూరింది. ఇతర ప్రయాణికులు సైతం బాత్ రూం కి వెళ్లాల్సి ఉండగా ఎంతసేపటికీ వారు డోర్ తీయడం లేదు. అనంతరం అసలు విషయం వెలుగుచూసింది.

వివరాళ్లోకి వెళ్తే... ఈజీ జెట్‌ సంస్థకు చెందిన విమానం ఇబిజాకు బయలుదేరింది. ఈ సమయంలో అంతా ఎవరి సీట్లలో వారు కూర్చుని ఉండగా... ఇద్దరు ప్రయాణికులు మాత్రం బాత్‌ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఈ సమయంలో వారిద్దరూ లోపల నుంచి ఎంతసేపటికీ రాకపోవడంతో సిబ్బంది అలర్ట్ అయ్యింది.

కాసేపటికి సిబ్బందిలో ఒకరు తలుపు తెరవమని కోరగా.. ఆ జంట ఏ మాత్రం స్పందించలేదు. అనంతరం కాస్త గట్టిగానే పిలిచారు. అయినా కూడా వారు రియాక్ట్ కాలేదు. దీంతో సిబ్బంది బలవంతంగా ఆ బాత్ రూం డోర్‌ తెరిచారు. దీంతో లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి షాకయ్యారు.

డోర్ బలవంతగా తెరిసే సమయానికి బాత్ రూం లోపల ఆ జంట ఒక శృంగార భంగిమలో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఒక ప్రయాణికుడు ఈ విషయాన్నంతా వీడియో తీశారు. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ జంటను పోలీసులకు అప్పగించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Tags:    

Similar News