ఫ్లైట్ జర్నీలు తరచూ చేస్తారా? అయితే మీకిది గుడ్ న్యూస్

ఈ ఇబ్బందిని అధిగమించేందుకు వీలుగా తాజాగా పౌర విమానయాన భద్రతా సంస్థ కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది.

Update: 2024-04-02 04:08 GMT

ప్రపంచం మొత్తం మాంద్యం ముచ్చెమటలు పోయిస్తుంటే.. అందుకు భిన్నమైన వాతావరణం భారతదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. మాంద్యం వేళ జేబులోని రూపాయిని ఖర్చు చేయాలంటే పలు దేశాలకు చెందిన పౌరులు ఆలోచిస్తుంటే.. భారత్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి విమాన ప్రయాణాలు అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. విమానాల్లో రద్దీ ఇప్పుడు భారీగా పెరుగుతోంది. దీంతో.. విమానాలు ఆలస్యమవుతున్న పరిస్థితి.

విమానాలు తరచూ ఆలస్యం అవుతున్న కారణంగా వాటిల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. దీంతో గంటల కొద్దీ టైం వేస్టు అవుతోంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు వీలుగా తాజాగా పౌర విమానయాన భద్రతా సంస్థ కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 30 తర్వాత నుంచి కొత్త నియమావళిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీని ప్రకారం విమానం ఆలస్యమైన తర్వాత ఎయిర్ పోర్టులోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ ద్వారం నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా తాజా మార్గదర్శకాల్ని విడుదల చేశారు. దీంతో ఫ్లైట్ ఆలస్యమైనంతనే.. గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే ఉండిపోకుండా.. బయటకు వచ్చేసేందుకు వీలుగా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పాలి. తరచూ ఎయిర్ ట్రావెల్ చేసే వారికి ఈ కొత్త విధానం వెసులుబాటుగా ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News