పిక్‌ టాక్‌ : లండన్‌ లో కూల్‌ అండ్‌ క్యూట్‌ మహేష్‌

మహేష్ బాబు లండన్ ట్రిప్

Update: 2023-07-25 06:52 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తాజా షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీ తో సరదా సమయాన్ని గడుపుతున్నారు.

తాజాగా మహేష్ బాబు లండన్ ట్రిప్ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్ లో మహేష్ బాబు సందడి చేశాడు. ఈ ఫోటోలో మహేష్ బాబు టీ షర్ట్‌ లో క్యూట్ అండ్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్ది మరింత అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. విదేశాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువగా ఉండటం.. ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్న కారణంగా మహేష్ బాబు ఇంత అందంగా ఉంటున్నాడేమో అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి గుంటూరు కారం నుండి చిన్న బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం లండన్ లో సందడి చేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ గుంటూరు కారం సినిమా షూటింగ్ కి రీ జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.

వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా ఉన్న విషయం కూడా తెలిసిందే.

Tags:    

Similar News