ఎయిరిండియా ఫ్లైట్లలో కొత్త క్లాస్.. అదేమంటే?

త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే ఈ క్లాస్ తో సరికొత్త అనుభూతిని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Update: 2024-06-20 07:30 GMT

దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి ఒక గుడ్ న్యూస్. ఒక కొత్త క్లాస్ ను క్రియేట్ చేసింది ఎయిరిండియా. అయితే.. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన రూట్లలోనే ఉండనుంది. తాజాగా ప్రీమియం ఎకానమీ క్లాస్ ను అందుబాటులోకి తేనున్నట్లుగా ఎయిరిండియా ప్రకటించింది. త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే ఈ క్లాస్ తో సరికొత్త అనుభూతిని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్ కోసం రెండు కొత్త ఏ320 నియో ఫ్లైట్లను సిద్ధం చేస్తుననట్లుగా సదరు సంస్థ తెలిపింది. చిన్న విమానాల్లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ లను తీసుకొచ్చిన తొలి సంస్థగా ఎయిరిండియా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ వసతిని మొదట ఢిల్లీ - బెంగళూరు, బెంగళూరు - ఢిల్లీ, ఢిల్లీ - చండీగఢ్, చండీగఢ్ - ఢిల్లీ రూట్లలో తిప్పే రెండు విమానాల్లో ఈ సేవల్ని అందిస్తారు.

ఈ క్లాస్ కోసం సిద్ధం చేస్తున్న రెండు ఏ320 నియో విమానాలకు అనుగుణంగా.. రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే నియో విమానాల్లోనూ ఈ క్లాస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విమానాల్లో బిజినెస్ క్లాస్ 8 సీట్లు.. ప్రీమియం ఎకానమీలో అదనపు లెగ్ రూమ్ తో 24 సీట్లు.. ఎకానమీ విభాగంలో 132 సీట్లు ఉండనున్నాయి. వచ్చే ఏడాదికి ఎయిరిండియా మొత్తం న్యారో బాడీ విమానాల్లో ఈ మూడు క్లాసులు అందుబాటులోకి రానున్నాయి.

Tags:    

Similar News