ఫ్లోటింగ్ ఫైవ్ స్టార్ హోటల్... తొలి సాగర ప్రయాణం స్టార్ట్!

తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన ఈ నౌక సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టింది.

Update: 2023-12-21 05:22 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక అనగానే టైటానిక్ ని ఎక్కువమంది గుర్తు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఇటీవల చైనా తయారుచేసిన ఈ ఓడ టైటానిక్‌ తరహా నౌకగా పేరుగాంచింది. ఈ భారీ నౌకకు "మోబీ లెగసీ" అని నామకరణం చేశారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన ఈ నౌక సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టింది.

అవును... గ్వాంగ్‌ ఝౌ షిప్‌ యార్డ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన "మోబీ లెగసీ" అనే భారీ నౌక తొలి సాగర ప్రయాణం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... చైనాలోని గ్వాంగ్‌ ఝౌ తీరం నుంచి ఇటలీకి బయలుదేరింది. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఝౌ జుహుయ్... ఈ మోబీ లెగసీ, ఫ్లోటింగ్ ఫైవ్ స్టార్ హోటల్ లాంటిదని తెలిపారు. ఈ ఓడ ఒకే విడతలో 2,500 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది.

ఈ సమయంలో ఈ భారీ నౌక ప్రత్యేకతలేమిటనేవి చూద్దాం..! 237 మీటర్ల పొడవు ఉన్న ఈ ఓడలో 533 లగ్జరీ గదులతో 13 అంతస్తులు ఉంటాయి. పై అంతస్తు వైశాల్యం దాదాపు 16,000 చదరపు మీటర్లు కాగా... అందులో 10,000 చదరపు మీటర్లు రెస్టారెంట్లు, ప్రయాణీకుల కోసం విశ్రాంతి, వినోద సౌకర్యాల కోసం కేటాయించబడిందని కంపెనీ తెలిపింది.

ఇక... 70 వేల టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం కలిగిఉన్న ఈ మోబీ లెగసీతో 800 కార్లు, ట్రక్కుల వంటి వాహనాలను సైతం ఇందులో తరలించవచ్చు. ఇక ఈ ఓడ పర్యావరణ అనుకూలమైనదిగా రూపొందించబడిందని.. తక్కువ ఇంధన వినియోగంతో 25 నాట్ల వేగంతో ప్రయాణించగల అత్యంత తక్కువ శక్తి ఇంజిన్ సిస్టం తో అమర్చబడిందని చెబుతున్నారు.

Tags:    

Similar News