సినిమా షూటింగులు చూడటం అంటే చాలా మందికి సరదానే! సినిమా షూటింగులు చూడటం అన్నా... వాటికి సంబందించిన లొకేషన్ ఫోటోలు చూడటం అన్నా బలే సరదాపడుతుంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ విదేశాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో షూటింగులు జరగడం వల్ల ఆ అవకాశం దక్కడంలేదనే చెప్పాలి!
అయితే తాజాగా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలాన్లు సృష్టిస్తూ... తెలుగు సినిమా ఖ్యాతిని విస్తరించి, స్థాయిని పెంచిన సినిమా బాహుబలి! తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాలు రాస్తుంది! అయితే ఈ షూటింగ్ కోసం జక్కన్న... ఏవేవో భారీ సెట్ లు వేశాడని, గ్రాఫిక్స్ తోనే నడిపేశాడని చెబుతున్నారు! అయితే బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనూ, భారతదేశంలో చెప్పుకోదగ్గ ప్రాంతాల్లోనూ జరిగింది! ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో, ఆయా ప్రాంతాల్లో ఏయే సన్నివేశాలు చిత్రీకరించారో తెలుసుకుందాం... వీలైతే వెళ్లి చూసొద్దాం...
బాహుబలి సినిమాకు సంబందించి చాలా వరకూ షూటింగ్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని రాక్ గార్డెన్ లో జరిగిందట! ఈ ఓర్వకల్ రాక్ గార్డెన్ భారతదేశంలోనే ప్రసిద్ధిచెందిందని చెప్పవచ్చు! ఈ రాక్ గార్డెన్స్ చూసి, బాహుబలి సినిమాను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఏయే సన్నివేశాలు ఎక్కడ చిత్రీకరించారన్నది గుర్తించే అవకాశం ఉంది! ఈ ప్రాంతంలో బాహుబలి షూటింగ్ తో పాటు గతంతో కూడా శుభాష్ చంద్రబోస్, శంభో శివ శంభో వంటి సినిమాలు కూడా అత్యధిక శాతం షూటింగ్ చేసుకున్నాయి!
బాహుబలి 1 లో సెకండ్ ఆఫ్ లో భారీ రాజ్యం, భారీ యుద్ధం ఇటువంటి కీలక సన్నివేశాలు అన్నీ జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో! రామోజీ ఫిల్మ్ సిటీతో రాజమౌలి కి ప్రత్యేక అనుబందం ఉందనే చెప్పాలి. మగధీర సినిమాలో కూడా రాజ్యానికి సంబందించిన సన్నివేశాలన్నీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరించారు! అదే క్రమంలో రాజ్యానికి, యుద్ధం జరిగే సన్నివేశాలన్నీ ఫిల్మ్ సిటీ వెనకాల ఉన్న మైదానంలో సెట్స్ వేసి చిత్రీకరించారు! సెకండ్ ఆఫ్ రాజ్యం, రాజ్యంలోని వీధులు వంటి సన్నివేశాలన్నీ ఫిల్మ్ సిటీలోని మీనా బజార్ లో చిత్రీకరించారు! రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు! ప్రపంచంలోని అందమైన, అన్ని సదుపాయాలు ఉన్న ఫిల్మ్ సిటీల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఒకటి!
బాహుబలి సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి! వాటిలో ఒకటీ తమన్నా ఎంట్రన్స్ సీన్! తమన్నా పరిగెత్తే సన్నివేశం, అడవిలో జరిగే ఫైట్ సీన్ లు చిత్రీకరించింది మహారాష్ట్రలో! మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో ని పర్వతాల సమూహాల మధ్య ఈ సన్నివేశాలను చిత్రీకరించారు! పర్యాటకంగా కూడా పచ్చని అడవులతో, పశ్చిమ కనుమల వరసలతో, సాహ్యాద్రి పర్వతాలతో ఎంతో ప్రాచుర్యం పొదింది!
బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎంట్రన్స్ సీన్ కి ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ఆ సినిమా స్టార్టింగ్ లొకేషన్ అండం మొత్తం, ప్రభాస్ చిన్నతనం మొత్తం ఒక జలపాతం కింద ప్రాంతంలోని జరుగుతుంది! అంత అందమైన జలపాతం ఉన్నది కేరళలో! ఈ బ్రహ్మాండమైన జలపాతానికి భారతదేశపు నయాగరా గా కూడా పేరుంది! కేరళ లోని త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది. బహుబలి పార్ట్ 1 ఫస్ట్ ఆఫ్ లోని చాలా ముఖ్య సన్నివేశాలన్ని ఇక్కడే చిత్రీకరించారు. భారతదేశంలోని చూడాల్సిన జలపాతాల్లో ఇది ఒకటి!