ఓరుగల్లు కాకతీయుల అనేక కట్టడాలు మనకు దర్శనమిస్తాయి. ఓరుగల్లు కాకతీయుల అనేక కట్టడాలు మనకు దర్శనమిస్తాయి. కాకతీయుల దర్పణానికి నిదర్శం ఈ వరంగల్ కోట! మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సుందర, చారిత్రాత్మక, చక్కని ప్రదేశాలు ఉన్నాయి! వాటిలో కాకతీయుల ఖిల్లా... వరంగల్ జిల్లా ఒకటి! ఈ ఓరుగళ్లులో చారిత్రాత్మక సందర్శనీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి! వాటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం...
వేయిస్తంభాల గుడి (హజార్తుతున్):
వరంగల్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల గుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! చిన్నప్పటి పాఠ్యపుస్తకాల నుండి ఇప్పటివరకూ ఎన్నో చూసిఉంటారు! కానీ ప్రత్యక్షంగా ఈ దేవాలయాన్ని సందర్సిస్తే కలిగే అనుభూతే వేరు! క్రీస్తుశకం 1162లో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. రుద్రేశ్వరాలయంగా పిలువబడే ఈ 1000 స్తంబాల దేవాలయంలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది. దానికి ఎదురుగా నందీశ్వరుడు, కల్యాణ మండపం ఉంటుంది. శివ, వైష్ణవ, సూర్య దేవెళ్లు కలిగిన త్రికుటాలయంగా భక్తులు ఈ దేవాలయాన్ని కొలుస్తారు. ఈ దేవాలయ ఈశాన్యంలో ఒక్ కోనేరు కూడా ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొదట సహస్ర శివనామ మంటపమని... ఆ తరువాత హజార్తుతున్ ... ఆ తరువాత కాలక్రమేనా వేయిస్తంభాల దేవాలయమని పిలుస్తున్నారు.
ఖిలావరంగల్ కోట:
వరంగల్ నగరంలో అతిపెద్ద పర్యటక కేంద్రంగా సందర్శకులను ఆకర్షిస్తోన్న మరో కోట... ఖిలావరంగల్ కోట! క్రీస్తుశకం 13వ శతాబ్దంలో కాకతీయులు పారిపాలించిన కోటే నేడు ఖిలా వరంగల్గా పిలవబడుతుంది! కోట చుట్టూ 7.5 కిలోమిటర్ల విస్తీర్ణంలో మట్టి కోట, ఆ తరువాత 4.5 కిలోమీటర్ల వస్తీర్ణంలో రాతికోట కలిగి ఉంటుంది. ఈ కోటలపై అక్కడక్కడ బురుజులు ఉంటాయి! వీటిని రక్షణ కోసం సైనికులు వేచి ఉండే గదులుగా వాడేవారు! ఈ కోటలో నాలుగు దిక్కులలో రాతితో చెక్కిన కాకతీయ కళాతోరణాలు మధ్యలో స్వయం భుదేవాలయం, శృంగారపు బావి ఉంటుంది. ఈ కోటకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి.
భీమునిపాత జలపాతం - భీమునిపాదం:
పచ్చనిచెట్ల మధ్య ఎతైన గుట్టల నుంచి వచ్చే భీమునిపాత జలపాతం పర్యటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది! ఈ జలపాతం అందాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు అంటే అతిశయోక్తి కాదు! వనవాసానికి వచ్చిన గుట్టల్లో నివాసమున్న పాండవులు... ఈ జలపాతం ఉన్న ప్రాంతం సీతానాగారం గ్రామం దగ్ధం అవుతుండగా మంటలను ఆర్పేందుకు రెండు గుట్టల మధ్య భీముడు కాలువేసి నీరును రెండు చేతులతో గుప్పి మంటలు ఆర్పివేసినట్లు పురాణాల ఆధారంగా గ్రామస్థులు చెబుతుంటారు! భీముడు కాలువేసిన చోట ఏర్పాడిన గుంటను భీమునిపాదం అంటారు. ఇక్కడ ఎండకాలంలో కూడా నీరు రావడం వింతైన అనుభూతిని కలుగిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వర్షాకాలం అనువైన సమయం!
రామప్ప దేవాలయం
కాకతీయరాజు గణపతిదేవుడి సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు కీ.శ. 1213లో వరంగల్ జిల్లా వెంకటాపురంలో రామప్ప దేవాలయాన్ని నిరంఇంచాడు! ఈ దేవాలయంలోని శిల్పాకళా సంపద ప్రపంచంలోనే గొప్ప విశిష్టత కలిగి ఉంది. రామప్ప అనే శిల్పి వీటిని చెక్కడంతో ఆలయానికి ఆ పేరు వచ్చింది! ఈ దేవాలయంలోని గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో... గర్భగుడిలోనూ అంతే వెలుగు ఉంటుంది! ప్రతి ఒక్కరూ ఈ అద్భుత కళాఖండాలను చూసి తీరాల్సిందే!