మంత్రి ఒంటరవుతున్నారా ?

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం

Update: 2023-07-25 07:47 GMT

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం డెవలప్మెంట్లు ఇఫుడు అధికార వైసీపీలో హాట్ టాపిక్ అయిపోయాయి. వివాదంపై జగన్మోహన్ రెడ్డి ముందు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చద్రబోసుతో చర్చించారు. తర్వాత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో మాట్లాడారు. ఆ తర్వాత ఎంఎల్సీ తోట త్రిమూర్తులును పిలిపించుకున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల్లో కొందరితో మాట్లాడించి నివేదిక తెప్పించుకున్నారట. మొత్తానికి అందిన ఫీడ్ బ్యాక్ ఏమిటంటే మంత్రి చెల్లుబోయిన ఒంటరిఅయిపోతున్నారట.

కారణం ఏమిటంటే మంత్రిపై పిల్లిచేస్తున్న ఆరోపణలనే ఎంఎల్సీ తోట త్రిమూర్తులు కూడా చేశారట. తోటది కూడా రామచంద్రాపురం నియోజకవర్గమే. ఒకపుడు పిల్లి-తోట ప్రత్యర్ధులు. అయితే 2019 ఎన్నికల తర్వాత తోట టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఎంఎల్సీ అయ్యారు. మండపేట నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను జగన్ అప్పగించటంతో ఇపుడు తోట ఎక్కువగా మండపేట మీద దృష్టిపెట్టారు. రామచంద్రాపురం నుండి నాలుగుసార్లు తోట గెలిచారు.

అందుకనే ప్రస్తుత వివాదంకు సంబంధించి తోటతో జగన్ మాట్లాడారు. అందరితో మాట్లాడిన తర్వాత ఏమి తేలిందంటే బోసు వర్గీయులపై మంత్రి కేసులు పెట్టిస్తున్నట్లు. అలాగే బోసు మద్దతుదారులను మంత్రి టార్గెట్ చేస్తున్నారట. దాంతో ఇంతకాలం ఓపికపట్టిన పిల్లి ఇపుడు ఒక్కసారిగా బరస్టయ్యారు. అయితే ఈ విషయాలను మంత్రి అంగీకరించటంలేదు.

తాను ఎవరిపైనా కేసులు పెట్టమని పోలీసులకు చెప్పలేదు, ఎవరినీ టార్గెట్ చేయలేదంటున్నారు. మంత్రి నియోజకవర్గం రాజోలు. అయితే ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు సీట్ గా మారటంతో పాటు పోయిన ఎన్నికల్లో తాను రామచంద్రాపురంలో పోటీచేయలేనని పిల్లి చెప్పటంతో చెల్లుబోయినను జగన్ రామచంద్రాపురంకు మార్చారు.

మొత్తానికి మొత్తానికి రామచంద్రాపురంలో వివాదం బాగా పెరిగిపోతోంది. ఈ మొత్తాన్నిచూస్తే మంత్రి ఒంటరైపోతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతల నుండి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్న విషయంలో క్లారిటిలేదు. బహుశా ఈరోజో రేపో ఇదే విషయమై మళ్ళీ జగన్ అందరితో భేటీ అవబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇపుడు గనుక రామచంద్రాపురం వివాదానికి ఫులిస్టాప్ పెట్టకపోతే ఇది మరాన్ని నియోజకవర్గాలకు పాకే ప్రమాదముందని అర్ధమైందట. ఇప్పటికే గన్నవరంలో కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. మరి జగన్ ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News