బ్రేకింగ్... రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం!

అయితే.. ఆ టెర్మినల్ నిర్మాణంలోని కొంత భాగం కూలిన సమయంలో ఘటనాస్థలిలో కార్మికులు ఎవరూ లేరు.

Update: 2025-01-24 12:45 GMT

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలిపోయింది. అయితే.. ఆ టెర్మినల్ నిర్మాణంలోని కొంత భాగం కూలిన సమయంలో ఘటనాస్థలిలో కార్మికులు ఎవరూ లేరు. దీంతో.. పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

అవును... రాజమండ్రి ఎయిర్ పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. కొత్త టెర్మినల్ భవనం నిర్మాణంలో కొంత భాగం కూలిపోయింది. ఇటీవలే కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని రోజులకే ఇలా జరగడం గమనార్హం.

ఈ కొత్త టెర్మినల్ భవన నిర్మాణం కోసం వేసిన పిల్లర్స్ లో కొన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని చెబుతున్నారు. దానికి సమీపంలోనే కార్మికులు పని చేస్తున్నా.. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అంటున్నారు. దీంతో... ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది అనే విషయాలపై విచారణ జరుగుతుందని తెలుస్తోంది.

ఈ సమయంలో... ఇంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయా.. లేక, మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఇప్పటికే ఆరాతీసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు.

ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్ట్ రికార్డ్!:

మరోపక్క... ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్ట్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇందులో భాగంగా... కేవలం వారం రోజుల్లో 30,172 మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు సాగించారు. ఇదే సమయంలో ఏడు రోజుల్లో 226 విమానాలు ఇక్కడ నుంచి ప్రయాణించాయి! అదే విధంగా.. ఒకే రోజులో 5,000 మంది ప్రయాణికులతో రికార్డ్ నెలకొల్పింది.

Tags:    

Similar News