వీడిన చెక్కపెట్టేలో శవం పార్శిల్ మిస్టరీ.. తెరపైకి షాకింగ్ విషయాలు!

పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, యండగండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి చెక్కపెట్టెలో శవాన్ని పంపిన కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-27 08:36 GMT

పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, యండగండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి చెక్కపెట్టెలో శవాన్ని పంపిన కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెరపికి వచ్చిన వేళ ఈ నెల 19న ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. తాజాగా ఈ కేసును చేధించినట్లు చెబుతున్నారు.

అవును... సంచలనం సృష్టించిన చెక్కపెట్టెలో మృతదేహం కేసు దర్యాప్తు పూర్తయిందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. ఈ కేసులో మొదటి నుంచీ నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్ వర్మతో పాటు అతడి రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉన్నట్లు తేల్చామని ఎస్పీ అన్నారు. కేసు వివరాలను వెల్లడించారు.

కేసు వివరాలు..!:

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళ ఇంటికి ఓ మృతదేహాన్ని పంపడం ద్వారా భయపెట్టాలని చూశాడు ఆమె మరిది శ్రీధర్ వర్మ. దీనికోసం ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అతడికి ఫుల్ గా మద్యం తాగించి, కారులో ఊరు బయటకు తీసుకెళ్లాడు.

ఈ సమయంలో నైలన్ తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు చెబుతున్నారు. ఈ హత్య డిసెంబర్ 17న జరగ్గా.. ఆ మృతదేహాన్ని 19వరకూ దాచాడు. ఈ సమయంలో.. ఓ సేవా సంస్థ ద్వారా తన వదిన తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని అందించి.. అనంతరం అతడి ప్రియురాలు సుష్మ ద్వారా ఆటోలో శవాన్ని చెక్కపెట్టెలో పంపించాడు.

ఇంటి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి అనుకుని పార్శిల్ అందుకున్నవారికి అందులో శవం ప్రత్యక్షమవ్వడంతో తులసి భయపడటం.. ఈ విషయం ఒక్కసారిగా ఊరంతా పొక్కడం.. పోలీసులు ఎంటరవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే వర్మ పరారైనట్లు చెబుతున్నారు. ఈ విషయంలో రెండో భార్య సహకరించిందని అంటున్నారు.

వాస్తవానికి శ్రీధర్ వర్మకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారని అంటున్నారు. పైగా ఇతడికి మూడు పేర్లు, ఇద్దరు భార్యలు, ఓ ప్రియురాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. తమ రెండో భార్య అక్క ఆస్తి కోసమే డెడ్ బాడీని పార్శిల్ లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారని అంటున్నారు.

Tags:    

Similar News