జగనూ..జైలూ..కుడు పెంచిన పవన్

ఇక మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కార్యకర్తలతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ చేసారు. జగన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి కుదిరితే చర్లపల్లి జైలుకు పంపిస్తామని సవాల్ చేసేలా మాట్లాడారు

Update: 2023-07-20 13:46 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచేశారు. ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేసి కేంద్ర పెద్దలను కలుసుకుని వచ్చారు. ప్రత్యేకించి కేంద్ర హోం మంత్రి బీజేపీకే కీలకం అయిన అమిత్ షాతో భేటీ పవన్ కి ఎనలేని సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని అంటున్నారు.

ఇక మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కార్యకర్తలతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ చేసారు. జగన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి కుదిరితే చర్లపల్లి జైలుకు పంపిస్తామని సవాల్ చేసేలా మాట్లాడారు. సై అంటూ ఆయన మాట్లాడడం విశేషం.

వాలంటీర్లు కూడా డేటాని సేకరిస్తూ తప్పుడు పనులు చేస్తున్నారని మరోసారి వారి మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన అంటున్నారు గర్జించారు. తన మీద వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు అయినా పెట్టుకోనీ తాను మాత్రం రెడీ అని ఆయన అంటున్నారు.

తాను వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్తామని అంటోందని, కోర్టుకు వెళ్లినా నన్ను జైలులో పెట్టినా నేను చేసిన కామెంట్స్ కి కట్టుబడి ఉంటాను అని ఆయన బిగ్ సౌండ్ చేశారు. నన్ను చిత్రవధ చేసుకున్నా చేసుకోండి అని ఆయన అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ ఎక్కడా తగ్గేదిలే అన్నట్లుగా వాలంటరీ వ్యవస్థ మీద మళ్లీ మళ్లీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద కోర్టుకు వెళ్తుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ నేను రెడీ అనడం ఒక విధంగా సవాల్ చేయడమే అంటున్నారు. ఏమీ ఆలోచించుకోకుండా నేను ఈ రకంగా కామెంట్స్ చేస్తానా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో వాలంటీర్లకు అధిపతి ఎవరు అని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు 23 రకాలైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆ డేటా అంతా మూడు ప్రైవేట్ ఏజెన్సీలకు వెళ్తోంది అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం అని అన్నారు. వాలంటీర్లు ప్రమాదంలో పడ్డారని కూడా పవన్ కామెంట్స్ చేశారు.

వాలంటీర్ల వ్యవస్థ మీద డేటా చౌర్యం మీద తాను అమిత్ షాకి ఫిర్యాదు చేసినట్లుగా కూడా పవన్ బయటపెట్టారు. మొత్తానికి పవన్ అమిత్ షాతో జరిగిన చర్చలలో ఏపీ ప్రభుత్వం మీద చాలానే ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం అవినీతి మయం అంటున్నారు. జగన్ని జైలుకు పంపుతామని అంటున్నారు. ఢిల్లీ టూర్ తరువాత పవన్ నిబ్బరంగా మాట్లాడడం, ఇక జగన్ ఇంటికే అని అనడం వంటివి చూస్తూంటే ఆయనకు బీజేపీ హై కమాండ్ ఏ రకమైన అండదండలు ఇచ్చింది అన్నది చర్చగా ఉంది.

మరో వైపు చూస్తూంటే పవన్ కళ్యాణ్ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గానే అడుగులు ముందుకు వేస్తుంది అని అంటున్నారు. ఇప్పటిదాకా వైసీపీ వర్సెస్ జనసేనగా ఉన్న వ్యవహారం కాస్తా ఇపుడు ఏపీ ప్రభుత్వం వర్సెస్ జనసేనాని గా మారబోతోంది. పవన్ని కోర్టు ద్వారానే శిక్షించాలని వైసీపీ ఆలోచిస్తూంటే జగన్ని జైలుకు పంపిస్తామని పవన్ అంటున్నారు. మీ ప్రభుత్వం పతనం చేస్తామని జగన్ కే డైరెక్ట్ గా పవన్ హెచ్చరించడమే ఇక్కడ విశేషం.

Tags:    

Similar News