పవన్ వీక్ పాయింట్ నే టార్గెట్ చేస్తున్న జగన్

పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో ఇపుడు ఉన్నారు

Update: 2023-07-21 10:57 GMT

పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో ఇపుడు ఉన్నారు. కానీ ఆయన మొదట నటుడు. ఆ సమయంలో ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా ఏవో అనివార్య కారణాల రిత్యా మూడు పెళ్ళిళ్ళూ జరిగాయి. మధ్యలో రెండు విడాకులు తీసుకున్నారు. అయితే ఇపుడు అవే ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యర్ధులకు అస్త్రాలుగా మారుతున్నాయి. మహిళా సెంటిమెంట్ తోనే పవన్ని దెబ్బ తీయడానికి వైసీపీ ఎంచుకున్న ఆయుధం ఆయన మూడు పెళ్ళిళ్ళు.

ఇది పవన్ ఎంత తిప్పుకొడుతున్నా తనను అలా అనొద్దు అని ఎంత హెచ్చరించినా వైసీపీ మాత్రం దాన్నే టార్గెట్ గా చేసుకుంది. పెళ్ళాలు అని అంటారని జగన్ మీద పవన్ ఏక వచన ప్రయోగంతో జగన్ మీద వారాహి యాత్రలో విరుచుకుపడ్డారు. జగన్ సీక్రేట్లు చెబుతాను అని బెదిరించారు కూడా.

అయినా జగన్ కూడా ఎక్కడా తగ్గడంలేదు. ఆయన నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ పవన్ని పట్టుకుని గతం కంటే ఎక్కువగా కామెంట్స్ చేశారు. ఈసారి పెళ్ళిళ్లతో పాటు అక్రమ సంబంధాల మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. వివాహ బంధం ఉండగానే వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని పవన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.

అమ్మాయిలను లోబర్చుకుని పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం అంటూ పవన్ మీద జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. క్యారక్టర్ లేదు అంటూ ఆయన పవన్ కి ఫుల్ డోస్ ఇచ్చేశారు. నిజానికి ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఆరోపణలు ఇలాంటివి వస్తే కవర్ చేసుకోవడం కష్టం. అవినీతి ఆరోపణలు జగన్ మీద విపక్షాలు చేస్తూ ఉంటే జగన్ వాటిని తిప్పి కొట్టే క్రమంలో ఇపుడు పవన్ మీద నేరుగా మూడు పెళ్ళిళ్ల ఆరోపణలను చేశారు.

ఇది ఆరంభం మాత్రమే అని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నందువల్ల అప్పటికి ఈ ఆరోపణలు పీక్స్ కి చేరుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ మూడు పెళ్ళిళ్ల విషయం ఎత్తవద్దంటూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా సార్లు ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపించారు. రాజకీయాల్లో అలా చేయడమే వ్యూహాత్మక తప్పిదం.

తమను ఏవైనా అంశాలు ఇబ్బంది పెడుతున్నాయనుకున్నపుడు వాటిని అలా పట్టనట్లుగా ఉంటేనే ప్రత్యర్ధులు వాటిని లైట్ తీసుకుంటారు. కానీ హర్ట్ చేశాయని తెలిసినా లేక వాటి వల్ల ఎమోషనల్ అయినా ప్రత్యర్ధులకు ఆయుధం దొరికినట్లే. ఇపుడు పవన్ తానుగా వ్యూహాత్మకంగా తప్పిదం చేశారో లేక ఆవేశంలో స్పీడ్ అయ్యారో కానీ మూడు పెళ్ళిళ్ల విషయంలో తాను చాలా సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతానని చెప్పకనే చెప్పేసుకున్నారు.

దాంతో ఇప్పుడు వైసీపీకి అది ఆయుధం అవుతోంది. ఈ రోజు పవన్ మూడు పెళ్ళిళ్ల నుంచి ఇంకా ముందుకెళ్ళి అక్రమ సంబంధాల దాకా సీఎం స్థాయి వ్యక్తి విమర్శలు చేశారు. రేపటి రోజున పవన్ నుంచి మళ్ళీ ఘాటు

రియాక్షన్ వస్తే ఇంతకు మించి అన్నట్లుగా ఇంకా మరింత లోతుగా పరిశీలించి వీలైతే పరిశోధించి ఆరోపణలు చేసేందుకు రెడీ అన్నట్లుగా వైసీపీ వైపు నుంచి సంకేతాలు వస్తున్నాయి.

నిజానికి విధానపరమైన విమర్శలకు కాలం చెల్లి చాలా కాలం అవుతోంది. ఇపుడు ఏకంగా వ్యక్తిగత ఆరోపణలకు దిగిపోతున్నారు. దాంతో ఇపుడు పవన్ నుంచి వచ్చే కామెంట్స్ బట్టే ఫ్యూచర్ లో వైసీపీ ఇంకా పెద్ద ఎత్తున పవన్ని టార్గెట్ చేయడం ఖాయమని అంటున్నారు.

ఇదంతా ఎందుకు అంటే మహిళా ఓట్లను ప్రత్యర్ధులకు అందకుండా చేయడం కోసమే. మహిళల సెంటిమెంట్ ని వైసీపీకి అడ్డం కొట్టేందుకే పవన్ వాలంటీర్ల మీద వుమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేశారు ఇపుడు దాన్ని కౌంటర్ చేస్తూ జనసేన అధినేత విషయంలో మహిళా ఓటర్లకు వ్యతిరేకత పెంచేలా ఆయన మూడు పెళ్ళిళ్ళను ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంత దూరం పోతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News