మార్పు మొదలైంది...ఈ డైలాగ్ జగన్ ది బ్రో...!

పేదలు ఎవరూ ఉండకుండా అమరావతిని పెత్తందార్ల రాజధానిగా చేద్దామని చూస్తే తాము సామాజిక రాజధానిగా మార్చామని జగన్ అన్నారు.

Update: 2023-07-24 09:19 GMT

సహజంగా అధికారంలో ఉన్న పార్టీని దించేయడానికి జనంలో మార్పు మొదలైంది అని విపక్షాలు అంటాయి. అది వారి పేటెంట్ హక్కు. జనాల తరఫున తామే ఈ డైలాగ్ చెబుతాయి. జనం మార్పు కోరుకుంటున్నారు అని కూడా అంటాయి. ఈసారి గద్దెనెక్కేది మేమే అంటూ కూడా సౌండ్ చేస్తాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అధికార పక్షాలు మార్పు లేదు అంతా మా వైపే అనే డైలాగ్ వాడడం చూస్తూ ఉంటారు.

కానీ ఏపీలో విపక్షాలు మార్పు మొదలైంది అని అంటూంటే అధికారంలో ఉన్న సీఎం జగన్ సైతం మార్పు మొదలైంది అని అంటున్నారు. ఇది నిజంగా తమాషాగానే ఉంది. మార్పు మొదలైతే అధికార పక్షానికి షాక్ కదా మరి ఇక్కడ ఏమిటి ఎలా అంటే ఈ మార్పు వల్ల విపక్షాలకే యమ డేంజర్ అన్నదే జగన్ డైలాగ్ వెనక ఉద్దేశ్యం అని అంటున్నారు.

ఏపీలో పేదలకు పెత్తందారులకు మధ్య అతి పెద్ద సమరం సాగుతోంది. అమరావతి రాజధానిని అందరి రాజధానిగా వైసీపీ చేయాలనుకుంది. ఆ కల ఇన్నాళ్ళకు సాకారం అయింది. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించాలనుకుంటే విపక్షం అడ్డు తగిలిందని కోర్టులో ఏకంగా 23 కేసులను పెట్టి మూడేళ్ల పాటు ఇబ్బందులు పెట్టిందని జగన్ విమర్శించారు. అయితే కోర్టులలో పేదల తరఫున పోరాడి చివరికి వారికి పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా పదమూడు వందల కోట్ల రూపాయలతో ఇళ్ళను నిర్మిస్తున్నామని జగన్ చెప్పారు.

ఎపుడూ పెత్తందార్లే పేదలను అణగదొక్కుతారని, అయితే ఇపుడు పేదలలో చైతన్యం వచ్చిందని, ఒక మార్పు మొదలైందని ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పుతో ఏపీలో విపక్షానికి అసలు విషయం అర్ధం అవుతుందని అన్నారు. పేదలు ఎవరూ ఉండకుండా అమరావతిని పెత్తందార్ల రాజధానిగా చేద్దామని చూస్తే తాము సామాజిక రాజధానిగా మార్చామని జగన్ అన్నారు.

అమరావతి అందరిదీ అన్న భావనను తీసుకుని వచ్చామని చెప్పారు. ఏకంగా కొత్తగా నిర్మించే ఇరవై అయిదు లే అవుట్లతో ఊళ్ళనే నిర్మిస్తున్నామని చెప్పారు. పెత్తందారుల మీద పేదలు చేస్తున్న యుద్ధంలో అతి పెద్ద విజయం దక్కిన రోజుగా ఆయన అభివర్ణించారు. పేదలకు న్యాయం తమ ప్రభుత్వం చేస్తోందని వారికి అండగా ఉంటోందని, దీంతో వారిలో వచ్చిన మార్పుని చూసి పెత్తందారులు కుట్ర చేసే వారే షాక్ తింటారని జగన్ అంటున్నారు.

మొత్తానికి జగన్ చెప్పే మార్పు ఇదన్న మాట. పేదలలో వచ్చిన మార్పు తనకు అనుకూలంగా ఉంటుందని పెత్తందార్ల కొమ్ము కాస్తున్న టీడీపీ ఇతర పార్టీల గుండెలలో ఆ మార్పు దడ పుట్టిస్తుందని జగన్ వైసీపీ భావిస్తున్నారు. అలాంటి మార్పునే కోరుకుంటున్నారు.

అదే టైం లో ఏపీలో పేదలు వర్సెస్ పెద్దలుగా విభజన జరిగి అది కాస్తా క్లాస్ వార్ గా మారితే పేదల పక్షనా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వైసీపీదే తిరిగి అధికారం అన్నది జగన్ మార్క్ పొలిటికల్ లెక్క అని అంటున్నారు. మరి జగన్ చెప్పిన ఈ మార్పుని విపక్షాలు అంగీకరిస్తాయా. అది నిజమని నమ్ముతాయా లేక ప్రజలంతా జగన్ పట్ల యాంటీగా ఉన్నారని తాము చెబుతున్న మార్పే నిజం అవుతుందని ధీమాగా ఉంటారా. వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News