అమరావతి వైపు బాలయ్య ఫోకస్ పెట్టేశారా ?

మరో వైపు చూస్తే బాలయ్య ఆదివారం సడెన్ గా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో పర్యటించారు.

Update: 2024-11-26 01:30 GMT

ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలక్రిష్ణ చూపు ఏపీ రాజధాని అమరావతి మీద పడింది అని అంటున్నారు. ఆయన అక్కడ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు అని అంటున్నారు. బాలయ్య కొత్త సినిమా డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని అమరావతి వేదికగా త్వరలో నిర్వహించనున్నారు అన్నది ప్రచారంలో ఉన్న వార్త.

అదే సమయంలో అమరావతిలో నిర్వహించే అతి పెద్ద సినిమా పండుగగా కూడా ఇదే ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే బాలయ్య ఆదివారం సడెన్ గా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను ఆయన స్వయంగా ఆకళింపు చేసుకున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అసలు బాలయ్య అమరావతి రాజధాని వైపు ఎందుకు వెళ్లారు అంటే ఇక్కడే అసలైన పాయింట్ ఉంది అని అంటున్నారు. బాలయ్య సినీ హీరో మాత్రమే కాదు బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ కూడా. ఆయన హైదరాబాద్ లో ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు.

ఏపీలో కూడా అటువంటి ఆసుపత్రినే నిర్మిస్తామని కూడా గతంలో చెప్పారు. ఇక అమరావతి రాజధానిలో పారిశ్రామికవేత్తలకు ఇతర ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములను కేటాయించింది. అదే విధంగా బసవతారకం ఆసుపత్రికి కూడా భూములను 2017లోనే అప్పటి తీడీపీ ప్రభుత్వం కేటాయించింది అని అంటున్నారు.

ఆ భూములలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని బాలయ్య అనుకునేంత లోపుగానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మూడు రాజధానుల ఇష్యూతో అమరావతి వెనకబడిపోయింది. దాంతో ఆ వైపుగా బాలయ్య సహా ఎవరూ చూడలేని పరిస్థితి ఉంది. ఇపుడు చూస్తే అమరావతికి కొత్త కళ వస్తోంది.

కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో ప్రపంచ బ్యాంక్ 15 వేల కోట్ల రూపాయల నిధులను రుణంగా ఇస్తోంది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి అతి పెద్ద ముందడుగు పడబోతోంది. అదే సమయంలో ప్రైవేట్ ప్రాజెక్టులను కూడా తమకు కేటాయించిన భూములలో నిర్మాణం పనులను చేపట్టాలని ప్రభుత్వం కోరుతోంది.

దీంతో టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు వియ్యంకుడు కూడా అయిన బాలయ్య తానుగా చొరవ తీసుకుని ముందు ఆసుపత్రి నిర్మాణం పనులను చేపట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన సడెన్ గా అమరావతి భూములలో పర్యటించారు అని అంటున్నారు.

బాలయ్య మంచి ముహూర్తం చూసుకుని ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ భూమి పూజ నిర్వహించి ఆసుపత్రి నిర్మాణం పనులకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. దాని కంటే ముందు తన కొత్త సినిమా ఫంక్షన్ నిర్వహించడం ద్వారా అమరావతికి కావాల్సినంత మైలేజ్ ని కూడా తీసుకుని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే రానున్న రెండేళ్లలో బసవతారం ఆసుపత్రిని అమరావతిలో పూర్తి చేసి ప్రారంభించాలని బాలయ్య ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయనతో పాటుగా చాలా కంది ప్రైవేట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు కూడా తమ సంస్థల కార్యకలాపలను ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ కూడా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటుగా సమాంతరంగా సాగితే కనుక రానున్న రెండు మూడేళ్ళలో అమరావతి రాజధానికి ఒక మంచి రూపు వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి బాలయ్య అమరావతి మీద పూర్తిగా ఫోకస్ పెట్టేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News