అది బూతు పార్లమెంటు

Update: 2015-07-28 09:10 GMT
 చొంగ కార్చుకోవడంలో బ్రిటీషోళ్లను మించినోళ్లు లేనట్లున్నారు... ఈ విషయంలో బ్రిటీషోళ్లందరిలోకీ అక్కడి పార్లమెంటులో పనిచేసేవాళ్లు మరింత ముదుర్లట. బ్రిటన్ పార్లమెంటులో ఉన్న కంప్యూటర్లలో రోజుకు కనీసం 700 సార్లు బూతు బొమ్మలు, వీడియోలు, కథలు, ఇంకా బూతుకు సంబంధించిన అనేక సంగతులకోసం వెతుకున్నారట.  

బ్రిటన్ పార్లమెంటులోని వివిధ సభల్లో సభ్యులతో పాటు సుమారు 5 వేల మంది పనిచేస్తుంటారు.. అయితే... ఈ బూతు ప్రేమికులు ఎంపీలా లేదంటే సిబ్బందా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇంకో విశేషమేంటంటే యూకే పార్లమెంటులో పోర్నసైట్ల ను బ్లాక్ చేసినప్పటికీ అలాంటి అడ్డంకులను దాటేసి మరీ గుడ్డలిప్పేసిన సుందరాంగుల శృంగార దృశ్యాలు చూడడానికి గుడ్లప్పగించేస్తున్నారట. గత ఏడాదిలో ఇలా బ్లాక్ చేసిన సైట్ల ను చూడడానికి 247000 ప్రయత్నాలు చేశారని సమాచారం.  ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లా ప్రకారం ఒక్క ఏప్రిల్ నెలలోనే 42 వేల మంది ఇలా బ్లాక్ చేసిన సైట్లనుంచి బూతు బొమ్మలు చూసే ప్రయత్నం చేశారట. రోజుకు సగటున 1300 ప్రయత్నాలు జరుగుతున్నాయట.

కాగా 2013లో 3 లక్షలకు పైగా సార్లు పార్లమెంటులో ఈ బూతుబొమ్మలు చూశారట. వారిలో ఎక్కువమంది శృంగారరససాగర లోతులను మరింతగా తెలుసుకోవాలన్న ఆరాటంతోనే ఆ పనిచేశారట. ఇంతకీ ఇంతలా వేడెక్కిపోతున్న బ్రిటన్ పార్లమెంటు సిబ్బంది తీరా అక్కడికి వచ్చేసరికి పస చూపిస్తున్నారో లేదో మాత్రం తెలియాలి.
Tags:    

Similar News