భారత ఐటీ నిపుణులపై ట్రంప్ ప్రభావం... నాస్కామ్ షాకింగ్ కామెంట్స్!

ఇదే సమయంలో... హెచ్-1బీ వీసాల విస్తరణ విషయంలో రిపబ్లికన్స్ మధ్య రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కూడా రెండూ నచ్చాయని అంటున్నారు

Update: 2025-01-23 03:56 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా బర్త్ రైట్ సిటిజన్ షిప్ (జన్మతః పౌరసత్వ హక్కు) రద్దుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... హెచ్-1బీ వీసాల విస్తరణ విషయంలో రిపబ్లికన్స్ మధ్య రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కూడా రెండూ నచ్చాయని అంటున్నారు.

దీంతో... హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ అంతిమ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. మరోపక్క.. భారీ ఏఐ ప్రాజెక్ట్ "స్టార్ గేట్" కు ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ విలువ $500 బిలియన్స్ (సుమారు రూ.43 లక్షల కోట్లు) కాగా.. ఇప్పటికే ప్రాథమికంగా $100 బిలియన్స్ (రూ.8.6 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నారని అంటున్నారు.

దీనివల్ల అమెరికాలో లక్షల ఉద్యోగాలు సృష్టించొచ్చని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ తెలిపారు. దీంతో.. హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో... అమెరికాకు వెళ్లే భారత ఐటీ నిపుణులపై ట్రంప్ తాజా చర్యల ప్రభావంపైనా చర్చ మొదలైంది. ఈ సమయంలో.. ఐటీ పరిశ్రమ సంఘం 'నాస్కామ్' కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... హెచ్-1బీ వీసాలపై వెళ్లేవారు అమెరికా నిపుణులకు చెందాల్సిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని.. అమెరికాలో వేతనాలు తగ్గేందుకు కారణమవుతున్నారని అనుకోవడం అనేది పూర్తిగా భ్రమ అని ఈ నాస్కామ్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ సంఘం వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ట్రంప్ తాజా చర్యలు, ఆదేశాల వల్ల యూఎస్ వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం ఉండదని తెలిపారు.

అసలు అమెరికా ఆర్థిక వృద్ధికి సాంకేతికతే కీలకమని గుర్తు చేసిన ఆయన.. అక్కడ ఉన్న కీలక నైపుణ్య లోటును పూడ్చడానికి హెచ్-1బీ వీసాలపై వెళ్లేవారు సహకరిస్తున్నారని.. ఆ వీసాల వల్ల వాస్తానికి అమెరికా దేశానికే మేలు జరుగుతుందని.. ఆ విషయం ట్రంప్ కు తెలుసని.. అందువల్ల భారతీయ ఐటీ ఇండస్ట్రీ వృద్ధిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

కాకపోతే... ట్రంప్ తాజా సంచలనం... హెచ్-1బీ వీసా హోల్డర్లు తమ పిల్లల పౌరసత్వం విషయంలో ఎదుర్కోబోయే సవాళ్ల విషయంలో మాత్రం సానుభూతి వ్యక్తం చేస్తున్నానని శివేంద్ర సింగ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News