ఒబామా, హిల్లరీలకు బాబీ జిందాల్ మళ్లీ చురక

Update: 2015-06-29 08:53 GMT
అమెరికా అధ్యక్షుడు ఒబామా... డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ లపై అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ వారిని ఆయన విమర్శిస్తున్నారు. తాజాగా స్వలింగ సంపర్కుల వివాహాలపై వారి కామెంట్లపై జిందాల్ విమర్శల వర్షం కురిపించారు. ఒపీనియన్ పోల్స్ ఆధారంగా వారు గే వివాహాలపై బాధ్యతారహితంగా తమకు నచ్చినట్లు మాట్లాడేశారని ఆరోపించారు.

గే వివాహాలకు అనుకూలంగా అమెరికాలోని సుప్పీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలసిందే. దాన్ని అమెరికా సాధించిన విజయంగా ఒబమా, హిల్లరీలు అభివర్ణించారు. అయితే... క్రిస్టియన్ ఆచారాల ప్రకారం తాను దీనికి విరుద్ధమని పేర్కొన్న ఆయన పెళ్లంటే ఆడామగా మధ్య జరిగేది మాత్రమేనని స్పష్టం చేశారు. కోర్టు తీర్పుతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. బాబీ జిందాల్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీలపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఆయన బరాక్ ఒబామాపై ఆరోపణలు గుప్పించారు. జాతి, మతం, ప్రాంతాలను బట్టి మనుషులను విభజించేందుకు ఒబామా యత్నిస్తున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన అమెరికన్ అన్న కారణంతో తనను అమెరికన్ల నుంచి వేరుగా చూడొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్సు వచ్చింది.
Tags:    

Similar News