టాప్ లెస్ నిరసనతో టాప్ లేపారు

Update: 2015-08-04 05:56 GMT
కెనడాలో తాజాగా జరిగిన ఒక నిరసన ప్రదర్శన ఇప్పుడా దేశంలో చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని వాటర్ లో.. అన్ టారియోలలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. దీనికి వందలాది మహిళలు ‘‘టాప్ లెస్’’ (ఛాతీ భాగంలో ఎలాంటి అచ్ఛాదన లేకుండా) గా నిరసన వ్యక్తం చేశారు.

మహిళల పట్ల సాగుతున్న వివక్ష.. వారి హక్కుల భంగం కలిగించటంపై తీవ్ర నిరసనను నిర్వహించారు. గత నెలలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు సైకిల్ మీద వెళుతున్నారు. సైకిల్ తొక్కటం కారణంగా చెమటకు ఇబ్బందిగా అనిపించి వారు పైన చొక్కాలు తీసి సైకిల్ తొక్కుతున్నారు. దీనికి ఒక పోలీసు అధికారి వారిని ఆపి.. చొక్కా ధరించాలని కోరారు.

అనంతరం.. తాను సైకిల్ కండీషన్ లో ఉందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం ఆపినట్లుగా పేర్కొన్నాడు. దీనిపై ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై సదరు పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసిన వారు.. సోషల్ నెట్ వర్క్ వేదికగా చేసుకొని.. తమకు జరిగిన అవమానాన్ని వెల్లడించి నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ‘‘మాకు రొమ్ములు ఉన్నాయి. కానీ.. అవి బాంబులు కావు’’ అని పేర్కొంటూ.. మహిళల్ని గౌరవంగా చూడాలని పేర్కొన్నారు.

మహిళలు తమకు నచ్చినట్లుగా వ్యవహరించటానికి వీల్లేకుండా.. ఆంక్షలు విధిస్తున్నారని.. యూనిఫాంలో ఉన్న పోలీసుల తీరును వారు తప్పు పట్టారు. ఈ అక్కా చెల్లెళ్ల పిలుపుతో వందలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. అత్యధికులు టాప్ లెస్ గా నిరసన వ్యక్తం చేశారు. మహిళను సెక్స్ వస్తువుగా చూడొద్దని పేర్కొంటూ.. మహిళల ఆత్మాభిమానాన్ని.. గౌరవాన్ని కాపాడాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల పట్ల ఇలాంటి వివక్ష ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది.
Tags:    

Similar News