జైలర్ రూ.500కోట్లు.. ఖాతాలోకి మరో సరికొత్త రికార్డ్
సూపర్ స్టార్ రజినీ కాంత్... 'జైలర్' చిత్రంతో గట్టి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజినీ కాంత్... 'జైలర్' చిత్రంతో గట్టి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించారు. రజినీ పనైపోయింది.. రెస్ట్ తీసుకోవాలనే వారికి ఈ చిత్రంతో గట్టి సమాధానమిచ్చారు. ఏడు పదుల వయసులోనూ ఎక్కడ తగ్గని స్టైల్, స్వాగ్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. బాక్స్ ఆఫీస్ ఈ సినిమా వద్ద ప్రభంజనం సృష్టించారు.
అసలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అస్సలు స్లో మూడ్‌లో నడిచే పరిస్థితే కనపడట్లేదు. కలెక్షన్ల వరద పారిస్తూనే ఉంది. రిలీజైన 10 రోజుల్లోనే రూ.500కోట్ల మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. వరల్డ్‌వైడ్‌గా పది రోజుల్లో 514.25కోట్లను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మార్క్‌తో తాజాగా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
రూ.400కోట్లతో కమల్‌హాసన్ విక్రమ్ లైఫ్ టైమ్ వసూళ్లను బ్రేక్ చేస్తే.. ఇప్పుడు రూ.500కోట్లతో పొన్నియిన్ సెల్వన్ లైఫ్ టైమ్ గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. కోలీవుడ్‌లో ఇంత ఫాస్ట్‌గా ఈ రూ.500కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన రెండో సినిమాగా నిలిచింది. అంతకుముందు రజనీ నటించిన రోజో 2.0 ఈ ఫీట్‌ను అందుకుంది.
ఈ సినిమా తొలి వారంలో రూ.450.80కోట్లను వసూలు చేయగా.. రెండో వారంలో మొదటి రోజు 19.37కోట్లు, రెండో రోజు 17.22 కోట్లు, మూడో రోజు 23.86కోట్లు వసూలు చేసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని బీస్ట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. దీనికి డైరెక్షన్ వహించారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
ఇంకా ఈ చిత్రంలో కన్నడ కింగ్ శివరాజ్‌కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీష్రాఫ్, సీనియర్ నటి రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమన్నా స్పెషల్ సాంగ్‌లో మెరవగా.. టాలీవుడ్ కెమెడియన్ సునీల్ తన కామెడీతో అదరగొట్టేశారు. సినిమా మొత్తానికి అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది.