మరోసారి షారుక్ మ్యాజిక్ నెంబర్ పక్కా

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మరోసారి తన స్టామినో ఏంటో నిరూపించారు.

Update: 2023-09-08 08:46 GMT

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మరోసారి తన స్టామినో ఏంటో నిరూపించారు. తన లేటెస్ట్ మూవీ జవాన్ తో మరోసారి బాక్సాఫీస్ పై విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి గత దశాబ్ద కాలంలో తన స్టార్ స్టేటస్ కు తగ్గట్టు షారుక్ ఒక్క భారీ హిట్ ను అందుకోలేదు. దిల్ వాలే, ఫ్యాన్, రేస్ ఇంకా పలు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2018లో వచ్చిన జీరో అయితే ఫుల్ రన్ టైమ్ లో రూ.100కోట్లను కూడా వసూలు చేయలేకపోయింది.

అలాంటి పరిస్థితుల్లో కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకుని పఠాన్ తో సెన్సేషన్ సృష్టించారు షారుక్. ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ ముందు ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నారు. మొత్తంగా దాదాపు రూ.1200కోట్లు అందుకున్నారు. నిజానికి ఆ చిత్రంలో అంత గొప్ప కథేమి ఉండదు. భారీ కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమాను లాగించేశారు.

కానీ పఠాన్ చిత్రానికి, బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు కలిసి రావడంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అయితే ప్రతీసారి బాక్సాఫీస్ దగ్గర అలాంటి మ్యాజిక్‌లు జరగకపోవచ్చు. కానీ షారుక్ విషయంలో మాత్రం మరోసారి అలా జరిగేలా అనిపిస్తోంది. ఇప్పుడు ‘జవాన్’కు కూడా ఊహించని రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్టామినా ఏంటో రిలీజ్ కు ముందే అడ్వాన్స్ రూపంలో కనిపించింది. ఇప్పుడు తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆ ఊపు మరింత ఎక్కువైంది.

తొలి రోజు జవాన్ చిత్రానికి రూ. 75 కోట్లు వచ్చాయని అంటున్నారు. హిందీ బెల్ట్ నుంచే రూ. 65 కోట్లు వసూలు తెలుగు,తమిళం నుంచి రూ.10కోట్లు వరకు వచ్చాయట. అంటే బాలీవుడ్ లో ఈ రేంజ్ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా షారుక్ అని చెప్పొచ్చు. దీంతో పఠాన్ సహా ఇతర బాలీవుడ్ సినిమాల వసూళ్ల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సౌత్ సిటీస్ లో బాక్సాఫీస్ వద్ద అంతా జవాన్ ఫీవరే కనిపిస్తోంది. లోకల్ సినిమాలను కూడా జవానే డామినేట్ చేస్తోందట. వాస్తవానికి ఈ చిత్ర కథ కూడా రొటీనే కానీ.. షారుక్ అభిమానులతో పాటు మాస్, యాక్షన్ ప్రేమికులకు కావాల్సినంత ట్రీట్ ఉండటం వల్ల సినిమా పైసా వసూల్ అంటూ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. అందుకే ఈ సినిమా కూడా రూ. వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

Tags:    

Similar News