అడల్ట్ యాప్ సీఈఓ రాజీనామా... తెరపైకి కొత్త ప్రాజెక్ట్!

భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త అమ్రపాలి గ్యాన్

Update: 2023-07-20 10:58 GMT

భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త అమ్రపాలి గ్యాన్ 36 సంవత్సరాల వయస్సులో ప్రసిద్ధ అడల్ట్ కంటెంట్ యాప్ "ఓన్లీ ఫ్యాన్స్" చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆ పోస్ట్ కు ఆమె తాజాగా రాజీనామా చేశారు!

అవును... 2016లో లండన్ లో ప్రారంభమైన అడల్ట్ కంటెంట్ యాప్ "ఓన్లీ ఫ్యాన్స్" సీఈఓ గా అమపాలి గ్యాన్ 18 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఓన్లీ ఫ్యాన్స్ అద్భుతమైన వృద్ధిని సాధించిందని చెబుతున్నారు. ఆ యాప్ యూజర్ బేస్ ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్లను అధిగమించడంలో అమ్రపాలి గ్యాన్ పాత్ర కీలకం అని అంటున్నారంట.

ఈమె సీఈఓ గా ఉన్న సమయంలోనే ఈ అడల్ట్ కంటెంట్ ప్లాట్‌ ఫారమ్‌ లో మూడు మిలియన్లకు పైగా క్రియేటర్స్ ని అదనంగా కలిగి ఉందని అంటున్నారు. పైగా... కంపెనీ ఈ క్రియేటర్స్ కి 10 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించిందని తెలుస్తుంది. ఇది ఈమె పదవీ కాలంలో ఒక మైలురాయని అంటున్నారు.

కాగా... అమ్రపాలి గ్యాన్‌ భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆమె కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం కాలిఫోర్నియాలో ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ మర్చండైజింగ్‌ నుంచి మర్చండైజ్ మార్కెటింగ్‌ లో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సాధించిందని తెలుస్తుంది.

ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పీఆర్‌ అండ్‌ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్స్‌ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ ను అభ్యసించడంతోపాటు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంట్రప్రెన్యూర్‌షిప్ సర్టిఫికేట్ తీసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలో తర్వాత అనేక రకాల ఉద్యోగాలు చేసిన ఆమె... 18నెలల క్రితం ఓన్లీ ఫ్యాన్స్ సీఈఓ గా బాధ్యతలు అందుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆ బాధ్యతలనుంచి గ్యాన్ తప్పుకున్నారు. కొత్త ప్రాజెక్ట్ కోసం ఓన్లీ ఫ్యాన్స్‌ కు రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇప్పుడు ఆ సంస్థకు కొత్త సీఈఓగా కీలీ బ్లెయిర్ నియమితులయ్యారు.

Tags:    

Similar News