బంజారాహిల్స్‌ లో పని మనిషిపై లైంగిక దాడి.. తండ్రీ కుమారుడిపై కేసు నమోదు!

ఇంట్లో పని చేసే యువతిపై యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌ గా ఫోటోలు, వీడియోలు తీశామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారని.

Update: 2023-10-21 03:00 GMT

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని తెలుసుంది. ఇంట్లో పని చేసే యువతిపై యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌ గా ఫోటోలు, వీడియోలు తీశామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని.. అయితే బాధితురాలు తన తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రధాన ప్రాంతీయ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం... నగరానికి చెందిన ఓ యువతి (22) ఇంటిలో పని చేసేందుకు ఏ ఏజెన్సీలో పేరు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్‌ 18న సదరు ఏజెన్సీ ఆమెను బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 మిథులానగర్‌ లో నివాసముండే వ్యక్తి ఇంట్లో పనికి పంపించింది. అప్పటి నుంచి ఆ యువతి ఆ ఇంట్లోనే పని చేస్తుంది. ఈ క్రమంలో... ఆమెపై ఆ ఇంటి యజమాని కన్నేశాడట.

ఈ క్రమంలో జూలై 16న యువతికి తన బెడ్రూంలో బెడ్‌ షీట్‌ మడత పెట్టాలని చెప్పిన యజమాని గది లోపలికి పంపించాడు. అనంతరం అతడు కూడా లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టాడట. ఆ తర్వాత స్నానంచేసి రావాలని ఆమెను బలవంత పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడట. దీంతో ఆ బెదిరింపులకు భయపడిన యువతి.. అతను చెప్పినట్లు చేసిందట.

అనంతరం ఆమె బయటకు వచ్చిన తర్వాత... స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియోలూ తీశానని, అవి చుపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడట. అనంతరం ఆమైపై లైంగికదాడికి పాల్పడ్డాడని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో రెండు రోజుల తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని ఆ యజమాని కుమారుడుకి చెప్పగా.. అతను బాధితారులిని తీవ్రంగా కొట్టి బెదిరించాడని అంటున్నారు.

ఇదే అదనుగా అతడు కూడా ఆమెపై పలుమార్లు ఆపై లైంగికదాడి చేశాడంట. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పిందట. అనంతరం.. తల్లి సహాయంతో ఈ నెల 18న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీంతో... బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆ ఇంటి యజమాని, అతని కుమారుడిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

ఇలా పొట్టకూటికోసం ఇంట్లో పనిచేయడానికి వచ్చిన యువతిపై ఈ దారుణానికి ఒడిగట్టిన ఇంటి యజమాని.. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ పేరు మురళీ ముకుంద్‌.. కాగా... అతని కుమారుడు ఆకాష్‌ మరొక నిందితుడు అని చెబుతున్నారు! దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News