సిమ్ కార్డు మోసాలపై టీ పోలీసుల కీలక అధ్యయనం.. చదవాల్సిందే

టెక్నాలజీ పెరిగే కొద్దీ సదుపాయాల స్థానే కొత్త తిప్పలు తెర మీదకు రావటం తెలిసిందే. సెల్ ఫోన్ హస్త భూషణంగా మారిన వేళ

Update: 2024-07-30 06:30 GMT

టెక్నాలజీ పెరిగే కొద్దీ సదుపాయాల స్థానే కొత్త తిప్పలు తెర మీదకు రావటం తెలిసిందే. సెల్ ఫోన్ హస్త భూషణంగా మారిన వేళ.. దాన్ని అసరాగా చేసుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న సైబర్ దొంగల బెడద అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ తెలంగాణ రాష్ట్ర పోలీసులు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) డేటా సైన్స్ ఇనిస్టిట్యూట్ తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీలు కలిసి సిమ్ కార్డుమోసాల మీద అధ్యయనాన్ని చేపట్టారు.

టెలికాం సిమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రాడ్స్: గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ అసెస్‌మెంట్స్ అండ్ రికమెండేషన్స్’ పేరుతో చేసిన ఈ అధ్యయనంలో పలు అంశాల్ని వెల్లడయ్యాయి. రోజువారీ సైబర్ నేరాల్లో సిమ్ కార్డు మోసం ముఖ్యమైనదని పేర్కొనటమే కాదు.. తమ రిపోర్టు సిమ్ కార్డు సబ్ స్క్రిప్షన్ మోసాన్ని తగ్గించేందుకు అవకాశం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని టెలికాం మోసాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు సిమ్ కార్డు మోసం ఉంటుందని.. దీని వల్ల టెలికాం రంగానికి ఏటా భారీ నష్టం వాటిల్లుతోందని పేర్కొంది.

160 దేశాల్లో సిమ్ కార్డు రిజిస్ట్రేషన్ కోసం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. దీని ద్వారా స్థానికంగా అమలు చేస్తున్న ప్రోటోకాల్ ను మరింత మెరుగు చేసేందుకు వీలుంది. ఈ అధ్యయనంలో పేర్కొన్న అంశాలేమంటే..

- 64.5% మంది భారతీయ వినియోగదారులు సిమ్ రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ కేవైసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆధార్ ను ఐడిగా ఉపయోగిస్తున్నారు.

- ప్రత్యామ్నాయ నంబర్లలో 89% ఆధార్‌కు లింక్ చేయటం లేదు. సిమ్ ధ్రువీకరణ ప్రక్రియలోఉన్న ప్రధాన లోపం.

- ఓటిపి ఆధారిత ధ్రువీకరణ బలహీనతలు బయటకు వచ్చాయి.

- సిమ్ జారీకి అనుసరించే మరో విధానమైన పాయింట్ ఆఫ్ సేల్ (పి ఓ ఎస్) ఏజెంట్లు అక్రమ పద్దతులకు పాల్పడుతున్నారు.

- ధ్రువీకరణ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ నంబర్లు తరచుగా ఇతర నేరస్థులకు లింక్ చేస్తున్నారు.

- నకిలీ ఆధార్ కార్డుల్ని ఉపయోగించి.. పిల్లల ఫోటోలను ఉపయోగించి దురుద్దేశపూర్వకంగా తప్పుడు మార్గంలో సిమ్ కార్డుల్ని మోసగాళ్లు పొందుతున్నారు. సైబర్ నేరాలకు ఈ సిమ్ కార్డుల్ని వినియోగిస్తున్నారు.

- వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి పంచకూడదన్న విషయాన్ని గుర్తించటం లేదు. సిమ్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా వెంటనే రిపోర్టు చేయాలి.

Tags:    

Similar News