దారుణం... అప్పు చెల్లించలేదని భర్త కళ్లెదుటే భార్యపై...!

తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారి

Update: 2023-07-28 05:32 GMT

కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో ఏపీలో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. అవసరానికి డబ్బులు ఇవ్వడం.. ఆనాక ఆ డబ్బులు చెల్లించని వారిపై లైంగిక దాడులకు పాల్పడటం జరుగుతున్న సంఘటనలు అప్పట్లో వెలుగు చూశాయి. ఈ సమయంలో పూణెలో తాజాగా ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగుచూసింది!

అవును... పూణెలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారి. ఆ సమయంలో ఆ దారుణాన్ని తన ఫోన్ లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులకు తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాళ్లోకి వెళ్తే... పూణెలోని భార్యభర్తలిద్దరు నిందితుడు ఇంతియాజ్‌ నుంచి రూ.40వేలు రుణం తీసుకున్నారు. కానీ అనుకున్న సమయానికి వారు అప్పును తిరిగి చెల్లించ లేకపోయారు. అయితే వారు ఫిబ్రవరిలోనే డబ్బులు చెల్లించాల్సి వచ్చినా ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. దీంతో కోపోద్రక్తుడైన ఇంతియాజ్‌... కత్తి తీసి వ్యక్తిని చంపుతానని బెదిరించడం ప్రారంభించాడు.

ఈ తరుణంలో అతనికి అడ్డు వచ్చిన.. ఆ వ్యక్తి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోని చూపించి బెదిరిస్తూ... తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని మహిళపై ఒత్తిడి తీసుకోచ్చాడు.

అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆ వడ్డీ వ్యాపారి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విసుగుచెందిన ఆ మహిళ ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

అనంతరం ఆ నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఇదే సమయంలో ఇంకెవరిననా మహిళను ఇలానే ట్రాప్ చేశాడా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News