భారత్ కు రాణా అప్పగించబడితే... కసబ్ ని గుర్తు చేసిన ఫడ్నవీస్!
అమెరికా పర్యటనలో భాగంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోడీ భేటీ అయిన వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
అమెరికా పర్యటనలో భాగంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోడీ భేటీ అయిన వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2008 నాటి ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్ కు వెంటనే అప్పగించాలని తన కార్యవర్గం పచ్చ జెండా ఊపిందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
దీంతో... ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోని మెట్రోపాలిటన్ నిర్భంధ కేంద్రంలో ఉన్న పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా భారత ప్రభుత్వానికి అప్పగించబడటం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన ఓ కీలక విషయం తెరపైకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ముంబై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్ కు అప్పగించాలని అమెరికా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనుకున్నది అనుకున్నట్లుగా అదే జరిగితే.. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘోరమైన దాడి వెనకున్న పాకిస్థాన్ కు చెందిన వ్యక్తుల ప్రమేయాన్ని భారత దర్యాప్తు సంస్థలు బహిర్గతం చేసేందుకు వీలువుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వాస్తవానికి.. 26/11 దాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన పాకిస్థానీ-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్ మన్ హెడ్లీతో పాటు అతడి అనుచరుడైన తహవ్వూర్ రాణాల అప్పగింత విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాకు అధికారిక విజ్ఞప్తి పంపింది. ఇదే సమయంలో దర్యాప్తుకు సహకరించాలని పాక్ కు వినతి పంపింది.. అయినా ఆ దేశం నుంచి ఎలాంటి సమాధానం లేదు!
అయితే.. 2008 నాటి ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్ కు వెంటనే అప్పగించాలని తన కార్యవర్గం పచ్చ జెండా ఊపిందని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించిన వేళ.. కచ్చితంగా ఈ ఘటన్లో పాక్ పాత్రపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మరోపక్క.. తహవ్వూరు రాణా భారత్ లో కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిదేనని.. అతడిని ఖైదు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా... తాము పాకిస్థానీ ఉగ్రవాది కసబ్ ను బంధించామని.. ఇక్కడ అంతకంటే పెద్ద విషయం ఏముటుందని.. తాము రాణాను కచ్చితంగా బంధిస్తామని తెలిపారు.
ఇక.. ఈ కేసు ముంబలోనిదని చెప్పిన ఫడ్నవీస్.. అతడిని ముంబై తీసుకురవాలని.. ముంబై ఉగ్రవాదుల కేసులో తుది న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.