మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం... 10 మంది మృతి!

మహారాష్ట్రలో ఓ ఘోరం జరిగిపోయింది. ఓ రైలులో మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు ఆ రైలు నుంచి దూకేశారు.

Update: 2025-01-22 13:51 GMT

మహారాష్ట్రలో ఓ ఘోరం జరిగిపోయింది. ఓ రైలులో మంటలు చెలరేగాయని పుకార్లు సృష్టించడం తో ఆందోళన చెందిన ప్రయాణికులు ఆ రైలు నుంచి దూకేశారు. మరికొంతమంది చైన్ లాగి ఎదురు చూశారు. ఈ సమయంలో రైలు నుంచి దూకిన ప్రయాణికులపైనుంచి మరో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 10 ఉంటుందని భావిస్తున్నారు.

అవును... మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నాడు రైలు ఢీకొనడంతో కనీసం 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయని క్లారిటీ లేదు పుకార్ల తో ఆందోళన చెందిన ప్రయాణికులు రైలు నుంచి దూకారు.

ఈ సమయంలో కొద్దిసేపటికే ఎదురుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం జరిగిందనే పుకార్లు ప్రయాణికులను తీవ్ర భయందోళనకు గురిచేశాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో గందరగోళం ఏర్పడటంతో కొంతమంది ప్రయాణికులు చైన్ లాగారు.

మరికొంతమంది మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో సమాంతర ట్రాక్ పై ఎదురుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. దీంతో... మృతి చెందిన వారి సంఖ్య 10 వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరోపక్క.. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మృతులు, క్షతగాత్రుల పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో స్థానిక రెస్క్యూ సిబ్బందితో పాటు వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Tags:    

Similar News