మణిపూర్ ఘటన..సంచలన విషయాలు వెల్లడించిన బాధితులు!
మణిపూర్ లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు జాతీయ మీడియాతో మాట్లాడారని తెలుస్తుంది.
మణిపుర్ లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే. యవత్ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో జరిగిన ఘోర సంఘటనల పై బాధితులు, వారి కుటుంబ సభ్యులు స్పందించారని తెలుస్తుంది.
మణిపూర్ లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు జాతీయ మీడియాతో మాట్లాడారని తెలుస్తుంది. ఇదేసమయంలో మహిళల్లో ఒకరు ఒక మాజీ సైనికుడి భార్య అని తెలుస్తుంది. ఈ విషయం ఆయన కూడా జాతీయ మీడియాతో స్పందించారని సమాచారం. ఈ సందర్భంగా వారు వెళ్లడించిన విషయాలు సంచలనంగా ఉన్నాయని తెలుస్తుంది.
అవును... "కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. దీంతోపాటు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది" అని ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడిన మాజీ సైనికుడు విలపించారని తెలుస్తుంది.
ఇదే సమయంలో... "మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ గుంపు.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. అనంతరం ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి ఊరేగించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులను కఠినంగా శిక్షించాలి" అని ఆయన డిమాండ్ చేశారని తెలుస్తుంది.
అదేవిధంగా... బాధిత మహిళలు కూడా ఈ విషయంపై స్పందించారని, ఆ రోజు జరిగిన ఘోరాన్ని వివరించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా... "మా గ్రామంపై దాడి చేస్తున్న గుంపుతో పోలీసులు ఉన్నారు. పోలీసులు మమ్మల్ని ఇంటి దగ్గర నుండి పికప్ చేసి, గ్రామం నుండి కొంచెం దూరంగా తీసుకెళ్లి గుంపుతో కలిసి రోడ్డుపై వదిలేశారు" అని పేర్కొందని తెలుస్తుంది.
ఇదే సమయంలో జంతువుల్లాగా ఆ గుంపు తమపైకి వచ్చిందని ఆ మహిళ తెలిపిందని అంటున్నారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకుని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని ఆ మహిళలు వాపోతున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో ఇక ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. లో పోలీసులు నమోదు చేసిన వివరాల ప్రకారం.. "దాదాపు 900-1000 మంది వ్యక్తులు ఏకే రైఫిళ్లు, ఇన్సాస్ తదితర అత్యాధునిక ఆయుధాలను పట్టుకొని ఆ గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలోని అన్ని ఇళ్లను లూటీ చేసి ధ్వంసం చేశారు. నగదును చోరీ చేయడంతోపాటు ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు." అని ఉందట.
ఇదే సమయంలో "చోరీ అనంతరం ఇళ్లకు నిప్పంటించారు. ఆ గ్రామానికి చెందిన ఐదుగురిని పోలీసులు రక్షించగా.. వారి నుంచి వాళ్లను లాక్కున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించగా.. ఆమె సోదరుడు రక్షించేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిని అక్కడిక్కడే ఆ దుర్మార్గులు హత్య చేశారు" అని పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని తెలుస్తుంది.