'35 చిన్న కథ కాదు' టీజర్.. మిడిల్ క్లాస్ ఏమోషన్

నూతన దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి మరియు విశ్వదేవ్ రచ్చకొండ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Update: 2024-07-03 13:51 GMT

నివేథా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "35-చిన్న కథ కాదు". ఈ సినిమా పోస్టర్స్ విడుదలయ్యాక ప్రేక్షకులలో మంచి ఆసక్తి కలిగించింది. ఇక ఇప్పుడు టీజర్ ను ను విడుదల చేశారు. నూతన దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి మరియు విశ్వదేవ్ రచ్చకొండ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.


తిరుపతి పట్టణాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా, మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని వివరిస్తుంది. నివేథా థామస్ గృహిణి పాత్రలో కనిపిస్తారు, ఆమె తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. విశ్వదేవ్ రచ్చకొండ ఆమె భర్తగా నటించారు. కొడుకు స్కూల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడం వల్ల, దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రియదర్శి కఠినమైన స్కూల్ టీచర్ గా కనిపిస్తారు.

టీజర్ ప్రారంభంలో హాస్యభరితంగా ఉంది, ముగింపుకు దగ్గరగా భావోద్వేగపూరితంగా మారుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనుభవాలను ఈ టీజర్ మనముందుకు తీసుకువస్తుంది. నివేథా థామస్ గృహిణి పాత్రలో చాలా రియాలిటీ గా నటించారు, విశ్వదేవ్ రాయలసీమ స్లాంగ్ ను సరైన విధంగా పలికారు. ఇక టీజర్ విజువల్స్ కూడా చక్కగా తీర్చిదిద్దారు, సంగీతం కూడా హైలెట్ అవుతోంది.

రానా దగ్గుబాటి, శ్రీజన్ యరబోలు మరియు సిద్దార్థ్ రల్లపల్లి కలిసి సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ మరియు వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు మరియు నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. "35-చిన్న కథ కాదు" తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ టీజర్ మనకు చూపించిన అంశాలు సినిమాకు బలమైన పునాది వేసాయి. మధ్యతరగతి కుటుంబాల్లో ఎదురయ్యే సాధారణ సమస్యలను, సున్నితమైన భావోద్వేగాలను ఈ టీజర్ లో చూపించడం ఆసక్తికరంగా ఉంది. నివేథా థామస్ నటన, విశ్వదేవ్ మరియు ప్రియదర్శి పాత్రలు, అలాగే ఈ సినిమా విజువల్స్, ఈ సినిమాపై భారీ అంచనాలను కలిగిస్తున్నాయి. మొత్తానికి, "35-చిన్న కథ కాడు" టీజర్ మంచి అనుభూతిని కలిగించింది అనే కామెంట్స్ వస్తున్నాయి. మంచి కథ, ఆకర్షణీయమైన పాత్రలు మరియు ప్రతిభావంతమైన నటీనటుల సమాహారం ఈ సినిమాకు సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.

Full View
Tags:    

Similar News