సెట్స్ లో హీరోయిన్ కోసం ఐదుగురు డాక్టర్లు!
ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు డాక్టర్లనే ఆన్ సెట్స్ లో ఉంచారుట. అందులోనూ ప్రత్యేకంగా మాళవికా మోహనన్ కోసం ఉంచినట్లు ఆమె తెలిపింది.
ఆన్ సెట్స్ లో డాక్టర్లు అందుబాటులో ఉండటం అన్నది ఎప్పుడు? జరుగుతుందో తెలిసిందే. హీరోయిన్లు గర్బిణీలుగా ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో నిర్వాహకులు డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతారు. అదీ హీరోయిన్ పై యాక్షన్ సన్నివేశాలు లాంటివి ఉన్న సమయం లోనే ఇలాంటి వెసులుబాటు దొరుకుతుంది. ఆమధ్య బాలీవుడ్ నటి అలియాభట్ ఓ హాలీవుడ్ సినిమాని అలాగే పూర్తి చేసింది.
ఆమెపై కీలకమైన యాక్షన్ సన్నిశాలు షూట్ చేయాల్సి రావడంతో డాక్టర్ తో పాటు అంబులెన్స్ కూడా రెడీ చేసి పెట్టారు. అలియాభట్ అప్పుడు నెలలు నిండుతోన్న గర్బిణీగా ఉంది కాబట్టి మేకర్స్ ముందొస్తు జాగ్రత్తలు తీసుకుని నటికి ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించలేదు. ఇలాంటి కేసెస్ లోనే డాక్టర్లు సెట్స్ లో అందుబాటులో ఉంటారు.
కానీ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్' షూటింగ్ కోసం మాత్రం ఆ సినిమా మొత్తం పూర్తి చేసే వరకూ డాక్టర్లను అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు డాక్టర్లనే ఆన్ సెట్స్ లో ఉంచారుట. అందులోనూ ప్రత్యేకంగా మాళవికా మోహనన్ కోసం ఉంచినట్లు ఆమె తెలిపింది.
కఠినమైన మ్యాకప్ తో షూటింగ్ లో పాల్గొనడం చాలా ఇబ్బంది పడిందిట. మ్యాకప్ వేసుకోవడానికే నాలుగు గంటల సమయం పట్టేదట. అటుపై ఎండలో షూటింగ్ చేయయడంతో ముఖమంతా మరింత మంట పుట్టేదట. దీంతో పాటు అక్కడక్కడా ఇచ్చింగ్స్ రావడంతో ఇరిటేట్ అయ్యేదట. షూటింగ్ తొలి రోజు ఎలాంటి డాక్టరు అందుబాటులో లేరుట. ఆ తర్వాత నటి అసౌకర్యాన్ని గుర్తించి డెర్మటాలజిస్ట్ ని, ఐ స్పెషలిస్ట్ ని, నరాల స్పెషలిస్ట్ ని ఇలా మొత్తంగా ఐదురుగురు డాక్టర్లను అందుబాటులో ఉంచారుట. మ్యాకప్ అధికంగా ఉండటంతోనే డాక్టర్ల అవసరం పడిందని, లేదంటే వాళ్ల అవసరం ఉండేది కాదని' తెలిపింది.