అమితాబ్ ఇంటి పక్కనే 17కోట్లకు ఇల్లు కొన్న నటి
పాపులర్ రియాలిటీ వెబ్ సైట్ అందించన వివరాల ప్రకారం.. ప్రీతి అపార్ట్ మెంట్ కు స్టాంప్ డ్యూటీ కింద రూ.85.07 లక్షలు చెల్లించింది.
సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింతా టాలీవుడ్ లో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సరసన రాకుమారుడు చిత్రంలో నటించిన ప్రీతి జింతా విక్టరీ వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలోను నటించింది. నటిగా విరమించాక ఈ భామ ఐపీఎల్ టీమ్ ల కొనుగోలు వ్యాపారంలో రాణించింది. రియల్ వెంచర్ల వ్యాపారంలోను ప్రీతి జింతా పాపులర్.
ఇప్పుడు ఈ భామ ముంబై బాంద్రా పరిసరాల్లో రూ.17.01 కోట్లకు విలాసవంతమైన ఆస్తిని సొంతం చేసుకుంది. పాలి హిల్‌లోని 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్మెంట్ ను వోన్ చేసుకుందనేది తాజా సమాచారం. ప్రీతి తన భర్త జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకోవడానికి ముందు నివసించినది ఇదే భవంతిలో అని తెలిసింది.
పాపులర్ రియాలిటీ వెబ్ సైట్ అందించన వివరాల ప్రకారం.. ప్రీతి అపార్ట్ మెంట్ కు స్టాంప్ డ్యూటీ కింద రూ.85.07 లక్షలు చెల్లించింది. 2016లో ఆమె వివాహం తర్వాత, లాస్ ఏంజిల్స్‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు తిరిగి ముంబైలో ఆస్తిని కొనుగోలు చేసింది.. అది కూడా తన పాత నివాస స్థలాన్ని కొనుగోలు చేసింది కాబట్టి ప్రీతి ఇక్కడే స్థిరపడుతుందని భావిస్తున్నారు.
పాలి హిట్- ఓషివారాలోని సిగ్నేచర్ భవనం ప్రత్యేకంగా పలువురు ప్రముఖులను ఆకర్షించింది. నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇటీవల అక్కడ ఒక ఆస్తిలో 31 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారు. సెప్టెంబరులో అమితాబ్ బచ్చన్ ఓషివారాలోని ఒక వాణిజ్య ప్రాజెక్ట్‌లో దాదాపు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు కార్యాలయ స్థలాలను దాదాపు రూ. 29 కోట్లకు కొనుగోలు చేశారు. జూలైలో కాజోల్ రూ. 7.64 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేయగా, ఆమె భర్త అజయ్ దేవగన్ రూ. 45 కోట్లకు ఐదు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ముంబైలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ కి బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద అండ. ఇక్కడ భారీగా రియల్ ఆస్తులు కొనుగోలు చేయడం.. ఆఫీస్ స్పేస్‌లలో పెట్టుబడులు పెట్టడంలో సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ ముందుంటారనడానికి ఇవన్నీ ప్రూఫ్.