ది గోట్ లైఫ్.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచేనా?

మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో నటించిన ‘ఆడుజీవితం - ది గోట్ లైఫ్’ సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే

Update: 2024-05-13 08:37 GMT

మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో నటించిన ‘ఆడుజీవితం - ది గోట్ లైఫ్’ సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఆడియన్స్ తోపాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం.. థియేటర్లలోకి మార్చి 28వ తేదీన వచ్చింది.

ఇప్పుడు ‘ఆడుజీవితం - ది గోట్ లైఫ్’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍ స్టార్.. మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు ఈ మూవీ కొత్త స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

మే 26వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‍ స్టార్ లో ఆడు జీవితం మూవీ స్ట్రీమింగ్‍ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్‍ కానుంది. అయితే ఈ విషయంపై హాట్‍ స్టార్ ఓటీటీ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మొత్తానికి ఆడు జీవితం మూవీ స్ట్రీమింగ్ అలా ఆలస్యం అవుతుంది.

అయితే ఆడుజీవితం మూవీ ఓటీటీలోకి ఎక్కువ రన్‍ టైమ్‍ తో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. థియేటర్లలో ఈ మూవీ రన్‍ టైమ్ సుమారు 3 గంటలు ఉండగా.. మరో అరగంట ఎక్కువ నిడివితో ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు బ్లెస్సీ ఓ సందర్భంలో హింట్ ఇచ్చారు. బెన్యామిన్ రచించిన ఆడు జీవితం పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్‍ కు జోడీగా హీరోయిన్ అమలా పాల్ నటించారు. కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్, శోభనా మోహన్, తలీబ్ అల్ బలూషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News